ప్రతి రాత్రి, యంత్రంగా మారుతున్న రహస్యమైన ఆలయం! |ప్రవీణ్ మోహన్|
Hey guys, ఈ రోజు మనం భారతదేశంలో ఉన్న, ఒక విచిత్రమైన ఆలయంలోకి వెళ్తున్నాము, ఈ ఆలయంలో, రాళ్లు గురించి, చాలా భిన్నమైన విషయం ఒకటుంది. ఈ ఆలయంలో, ఒక విచిత్రమైన శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది మనం ఈ నిర్మాణం, మధ్యలోకి వెళుతున్న కొద్దీ, శక్తి పెరుగుతూనే ఉంది. కానీ, ఈ శక్తి దైవికమైనదా, ఆధ్యాత్మిక శక్తినా, లేక మనం measure చేయలేని ఒక విధమైన భౌతిక శక్తినా? ఇక్కడఈ ఈ పునాదిని చూడండి, చాలా చిన్న చిన్న, cylindrical shapeలో, రాతి విగ్రహాలు ఉన్నాయి. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా, ఈ రకమైన నిర్మాణాన్ని, ఇప్పటివరకు నేను చూడలేదు, కానీ ఇప్పుడు ఏమి జరుగుతుందో అని చూద్దామా? అవునండి, ఇది తిరుగుతుంది. నమ్మలేకపోతున్నాం కదా. గాఢమైన ధ్యానంలో ఉన్న, ఈ సాధువును తిరిగేలా ఎందుకు రూపొందించారు? కానీ ఇదొక్కటే తిరిగే విగ్రహమా? మరింత ముందుకు వెళ్లి మరొక విగ్రహాన్నీ check చేద్దాం రండి, దీన్ని చూడండి, ఇది కూడా తిరుగుతుంది.
ఇది మాత్రమే కాదండి, ఇది కూడా తిరుగుతుంది. నిజానికి, ఇక్కడున్న, ఈ చిన్న విగ్రహాలన్నీ తిరిగే విధంగానే చెక్కారు, ఇప్పుడు తిరగకపోయిన, ఇవి ఒకప్పుడు ఖచ్చితంగా తిరిగేవి. ఇక్కడ మీరు, ఈ ప్రాంతాన్ని చూశారంటే, ఈ విగ్రహాలను మాత్రమే కాదండి, ఈ రంధ్రాలను కూడా చూడవచ్చు. పురాతన కాలంలో, చాలా తిప్పగలిగే విగ్రహాలు ఇక్కడ ఉండేవి, కానీ అవి ఇప్పుడు పోయాయి. తిరిగే విగ్రహాలలో, కొన్ని మాత్రమే ఇక్కడ మిగిలి ఉన్నాయి. ఇది చాలా అసాధారణమైన అన్వేషణ, కానీ, వాళ్ళు ఈ తిరిగే విగ్రహాలను ఎలా తయారు చేసారు, ఎందుకు తయారు చేశారు అనేది ఇప్పుడు నా ప్రశ్న కాదు, కానీ ఈ ఆలయంలో, ఇదే విధంగా, ఎక్కువ తిరిగేవి లేదా కదిలే భాగాలు ఉన్నాయా? నేను, ఈ ప్రశ్నను మళ్ళీ repeat చేస్తున్నాను, ఈ చుట్టూ, చాలా జాగ్రత్తగా చూడండి, ఈ ఆలయంలో మరిన్ని కదిలే భాగాలు ఉన్నాయా? ఈ ఆలయంలో, చాలా కదిలే భాగాలు మన కళ్ళ ముందే ఉన్నా, మనకు కనిపించకుండా దాగి ఉంటే? ఇప్పుడు, పైభాగంలో చూడండి, ఈ ప్రాంతంలో, మీకు ఈ మూడు శిల్పాలు కనిపిస్తున్నాయా? ఇవన్నీ తిప్పగలిగే విగ్రహాలేనా, లేదా ఇవన్నీ పైన ఉన్న ఒకే పెద్ద రాతి దిమ్మెకు attach అయ్యున్న విగ్రహాలా?
నేను మీకు, ఈ మూలను చూపిస్తాను చూడండి, మళ్ళీ మరో మూడు విగ్రహాలు ఉన్నాయి, కానీ ఇవి తిరిగే విగ్రహాలా? ఒక్కసారి ఆలోచించి చూడండి guys, ఈ గుడిలో ఉన్నవన్నీ, కదిలేవి లేదా తిరిగే భాగాలని, నేనే భావించి మతిస్థిమితం కోల్పోయానా? లేదా ఇవన్నీ నిజంగానే, కదిలే భాగాలేనా? సరే ఏది నిజం అని మీరు ఇప్పుడే decide చేసుకుండుంటారు, ఎందుకంటే, దీని పక్కనే, ఈ sideను నేను మీకు చూపించబోతున్నాను. అవునండి, మీరు ఈ రంధ్రాలను చూడవచ్చు, ఈ మూడు రంధ్రాలను ఇక్కడ వేశారంటే ఏంటని అర్ధం, అంటే ఒక్కప్పుడు, ఇక్కడ తిరిగే విగ్రహాలు ఉండేవి. వాటి పక్కనే ఉన్న అదే రాతి దిమ్మెలో, ఒక భాగంగా ఈ విగ్రహాన్ని వాళ్ళు చెక్కుంటే, ఈ రంధ్రాలను వేయాల్సిన అవసరమే లేదు. మనం, ఆ చిన్న చిన్న విగ్రహాలను, పైభాగంలో మరియు కింది భాగంలో రంధ్రాలను ఎలా చూసామో గుర్తుందా, ఆ విగ్రహాలన్నీ బాగా smoothగా తిరగాలని, దానికి తగ్గట్టుగా పైభాగంలో మరియు కింది భాగంలో రంధ్రాలను వేశారు. So, పైభాగంలో ఉన్న ఈ విగ్రహాలు, కూడా తిరిగే విగ్రహాలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఉండండి, మనం ఇంకా పూర్తి చేయలేదు, ఇది తప్ప, ఈ ఆలయంలో మరిన్ని కదిలే భాగాలు ఉన్నాయా?
పైన, ceiling లో చూడండి. ఇది mind-blowingగా ఉంది చూడండి. ఇది కూడా తిరుగుతుందా? ఇది తిప్పగలిగే ఒక రాయినా? మీరు ఏమనుకుంటున్నారు? ఈ రాయి rotate అవ్వకపోతే, పురాతన నిర్మాణదారులు, దీన్ని, ఇలాంటి ఒక విమానం యొక్క అంటే aicraft యొక్క ప్రొపెల్లర్ లాగా ఎందుకు డిజైన్ చేసారు? మీరు విమానంలో, ఈ తిరిగే ప్రొపెల్లర్లను చూసుంటారు, exactగా, ఆ ప్రొపెల్లర్ల మాదిరిగానే కనిపిస్తుందని చూడండి. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఇది కూడా విమానం యొక్క ప్రొపెల్లర్ లాగా తిరుగుతుందా? ఇప్పుడు, ఈ కదిలే భాగాలన్నీ, ఈ మధ్య ప్రాంతంలో మాత్రమే ఉన్నాయా, లేదా ఈ ఆలయం చుట్టూ, కదిలే భాగాలు ఉన్నాయా? మనం, దీని చుట్టూ నడుస్తున్నప్పుడు, ఇతర కదిలే భాగాలు మీకు కనిపిస్తున్నాయా లేదా అని, జాగ్రత్తగా చూడండి, అవునండి, మీరు సరిగ్గా guess చేశారని అనుకుంటున్నాను.