భూగర్భ ఆలయంలో బయటపడ్డ రెండవ బావి రహస్యం! |ప్రవీణ్ మోహన్|
Hey guys, ఈ రోజు మనం గుజరాత్ లో, Adalaj అనే చిన్న పట్టణంలో ఉన్న, చాలా రహస్యమైన నిర్మాణాన్ని చూడబోతున్నాం. రోడ్లకు, ఇళ్లులకు, మరియు చెట్ల మధ్యలో, ఒక లింగం ఆకారంలో ఉన్నఈ వింత నిర్మాణం ఏంటీ? ఒకవేళ ఇది, ప్రభుత్వం యొక్క రహస్య సంస్థనా లేక ఒక భూగర్భ బంకర్నా? లేదండి, ఇది అడలజ్ ని వావ్ అని పిలువబడే ఒక చారిత్రాత్మక నిర్మాణం. ఇది ఇంచుమించు, ఉత్తర-దక్షిణ అక్షం వైపు సరిగ్గా align అయింది చూడండి, దీని డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉంది. దీనికి ఉత్తరం వైపు చూసుకుంటే, అసలు ప్రవేశ ద్వారమే లేదు, ఈ నిర్మాణం యొక్క మధ్య భాగంలో కూడా, ఎలాంటి ప్రవేశ మార్గాలు కూడా లేవు చూడండి. కానీ ఇటువైపు చూడండి, ఇది మెట్లతో సహా, మూడు దిశలలో, ఒకదానికొకటి, కుడివైపున ఉన్న 3 ప్రవేశాలను కలిగి ఉంది.
అనేక శతాబ్దాల క్రితమే, ఇటువంటి, ప్రత్యేకమైన వాస్తుశిల్పాన్ని ఎందుకు నిర్మించారు? పైన ఉన్న, ఈ మూడు అష్టభుజ నిర్మాణాలు ఏంటీ? సరే రండి మనం, ground లోకి వెళ్లి, దగ్గరి నుండి దీన్ని చూద్దాం. ఇది చాలా ఆశ్చర్యకరమైన నిర్మాణం, ఎందుకంటే నేల స్థాయి నుండి చూసినప్పుడు, మనకు ఏమీ కనిపించడంలేదు చూడండి. సాధారణంగా, నేల స్థాయి నుండి మొదలై, పైకి వెళ్లే నిర్మాణాలను మాత్రమే, నేను మీకు చూపించాను. కానీ ఇందులో చూశామంటే, మనం గ్రౌండ్ లెవెల్ నుంచి మొదలు పెట్టి కిందకు దిగి undergroundలో వెళ్ళబోతున్నాం. అవునండి, ఇది ఒక భూగర్భ నిర్మాణం, కానీ, భూగర్భంలో ఎన్ని స్థాయిలు, న్ని అంతస్తులు ఉన్నాయో మీకు తెలుసా? ఈ భూగర్భంలో, కిందికి వెళ్ళడానికి, 5 విభిన్న స్థాయిలవెళ్ళాలి, అంటే 5 levels ఉన్నాయి. ఈ నిర్మాణం గురించి experts ఏం చెప్తున్నారని చూద్దామా? Experts, దీనిని Adalaj step well అని అంటున్నారు, అంటే అడలజ్ మెట్టు బావి అని అర్ధం, ప్రజలకు నీటిని అందించడానికి 2 ప్రత్యేక బావులతో దీనిని రూపొందించారని చెప్తున్నారు.
కేవలం నీటిని అందించడం కోసమే, ఇన్ని స్థాయిలు మరియు శిల్పాలతో కూడిన భారీ నిర్మాణాన్ని రూపొందించారా అని, మీరు అడుగుతున్నారని నాకు అర్ధమైంది. కానీ, దీనికంటే, విచిత్రమైన వాదన మరొకటి చెప్తున్నారు. వికీపీడియాలో దీనిని చూశామంటే, ఇది ఒక ఇండో-ఇస్లామిక్ నిర్మాణం అని చెప్తున్నారు, అంటే ఈ నిర్మాణాన్ని హిందువులు మరియు ముస్లింలు ఇద్దరూ నిర్మించారని చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యం? సరే ఇప్పుడు మనం, 75 అడుగుల కంటే ఎక్కువ లోతుకు వచ్చేసాము, మనం, ఇంచుమించు, ఈ నిర్మాణం యొక్క దిగువ స్థాయికి చేరుకున్నాము, ఈ వృత్తాకార బావిని మనం చూడవచ్చు. ఇది చూడడానికి, చాలా simpleగా కనిపిస్తుంది, సుమారు 12 అడుగుల వ్యాసం మరియు కేవలం 30 అడుగుల లోతు ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రజలు అన్ని వైపుల నుండి నీటిని, సులభంగా తీసుకునే విధంగా, నాలుగు వైపులా మెట్లను నిర్మించారు. నిజంగా, ఈ విశాలమైన 5 అంతస్తుల భూగర్భ నిర్మాణాన్ని, నిర్మించడం యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం ఈ బావి అయ్యే అవకాశం ఉందా? సరే మీరు చూడగలిగినట్లుగా, ఇక్కడ మరేమీ లేనట్లు అనిపిస్తుంది, కాబట్టి తిరిగి పైకి వెళ్లి ఇతర వివరాలను చూద్దాం రండి.
లేదండి. కొంచెం ఆగండి, ఇక్కడ రెండు బావులు ఉన్నాయని నేను చెప్పాను కదా, ఆ రెండవ బావి సంగతేంటీ? ఆ రెండో బావి ఎక్కడ ఉంది? మనం, ఈ మొదటి బావిని దాటి లోపలికి వెళ్లి, దానిని కనిపెట్టగలమా లేదా అని చూద్దాం రండి. మనం మొదటి బావిని, దాటి వెళ్ళిన తర్వాత, ఇక్కడ మరొక నిర్మాణం ఉంది చూడండి. ఇక్కడ ఒక ఇరుకైన ప్రవేశాన్ని మీరు చూడవచ్చు, ఇది కేవలం 2 అడుగుల వెడల్పు మాత్రమే ఉంది. ఇది చాలా ఇరుకుగా ఉంది, ఒక వ్యక్తి మాత్రమే వెళ్ళగలరు. హమ్మయ్య, ఇక్కడ, మనం, ఆ రెండవ రహస్య బావిని చూడవచ్చు.
Praveen Mohan Telugu

















