డాక్టర్లే shock అవుతున్నారు ఈ శిల్పాన్ని చూసి!
Hey guys, ఈరోజు నేను మీకు, డాక్టర్లు పురాతన దేవాలయాలను ఎందుకు visit చేయాలో అనే విషయం చూపించబోతున్నాను. ఇది వెయ్యి సంవత్సరాల పురాతనమైన తారకేశ్వర ఆలయం. దీనిని మకర ప్రాణాలయం అంటారు. ఇది నిజానికి మకర ఆకారంలో ఉన్న చిమ్ము. చాలా మంది మకర అనేది ఒక పౌరాణిక జంతువు అని అనుకుంటారు. ఈ రకమైన జంతువు పురాతన కాలంలో లేదు, శిల్పులు దీనిని కేవలం ఊహించారు. And కొంతమంది, ఒకప్పుడు మకరము నిజంగానే ఉండేదని, కానీ అది అంతరించిపోయిందని అంటారు. ఇప్పుడు, ఈ శిల్పాన్ని చూద్దాం, ఇందులో కొన్ని అద్భుతమైన వివరాలు ఉన్నాయి. దీన్ని చూడండి. సరే, మీరు చూస్తున్నారు కదా, ఈ మకర యొక్క నోరు తెరిచివుంది, and దాని నుండి నీరు బయటకు వచ్చే విధంగా రూపొందించబడి ఉంది.
ఇది ఒక సాధారణ చిత్రణ, మీరు దీన్ని అనేక పురాతన దేవాలయాల్లో చూడవచ్చు. కానీ నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది ఏంటంటే, వారు ఈ చారలను నరాలకు – నోటి పైభాగానికి చెక్కారు. మీరు ఈ చారలను చూడవచ్చు. Of course, మీ వద్ద పెంపుడు జంతువు లేకుంటే, మీరు కుక్క లేదా పిల్లిని పెంపుడు జంతువుగా పెట్టుకోకపోతే, ఇవన్నీ ఊహాత్మకమైన వివరాలు అని అనిపించవచ్చు. కానీ పెంపుడు జంతువులు ఉన్నవారు మరియు ఈ జంతువుల నోటి లోపల చూసినవారు, ఈ ridges నిజంగా ఉంటాయని తెలుసు. దీనికి ఒక పేరు ఉంది: దీన్ని "రుగా" అని అంటారు. ప్రతి మడతను రుగా అంటారు. దీని బహువచనం రుగే అవుతుంది, మరియు దీనిని పాలటైన్ రుగే (Palatine Rugae) అంటారు. Actually ఇది జంతువుల్లో ఉంటుంది మరియు దీనికి ఒక ప్రయోజనం కూడా ఉంది. జంతువు ఆహారాన్ని కొరికినప్పుడు మరియు మింగినప్పుడు, ఆహారాన్ని ఒకే చోట పట్టుకుని ఉంచుతుంది, తద్వారా ఆహారం మింగడానికి సహాయపడుతుంది.
కాబట్టి, దీనికి నిజంగా ఒక ఉద్దేశ్యం ఉంది. అయితే, ఈ శిల్పి ఈ చెక్కడంలో ఈ palatine rugaeను ఎలా చెక్కగలిగాడో ఊహించండి. కానీ మీరు ఒక గీక్ అని అనుకుందాం, ఈ రుగే మిమ్మల్ని ఆశ్చర్యపరచలేదు. ఈ శిల్పంలో ఇంకో వివరాలు ఉన్నాయి, అది నిజంగా అద్భుతమైనది. ముందు ఉన్న దంతాల కింద ఈ చిన్న గడ్డ కనిపిస్తుందా? ఇక్కడ ఒక చిన్న గడ్డ ఉంది, ఇది నిజానికి ఒక అవయవం. అవును, ఇది Jacobson’s organ అనే ఒక అవయవం. దీనిని Vomero-Nasal అవయవం అని కూడా పిలుస్తారు. ఇప్పుడే, మీలో కొంత మంది అనుకుంటారు – ‘ఓహ్, ప్రవీణ్ మోహన్ కొత్తగా జేకబ్సన్ అవయవం అనే ఒకదాన్ని కనిపెట్టేశారని!’ కానీ కాదు! మీరు పిల్లి నోటిని తెరిస్తే, ఇక్కడ చూపినట్లుగా ఇదే స్థానంలో జాకబ్సన్ అవయవాన్ని చూడవచ్చు. అది ముందు ఉన్న దంతాల కిందే ఉంది మరియు అది ఒక చిన్న bumpలా మాత్రమే కనిపిస్తుంది, మీరు మధ్యలో ఉన్న గీతను చూడవచ్చు, సరేనా? ఇప్పుడు అసలు ఈ Jacobson’s organ అంటే ఏంటీ?
ఇది గాలిలో ఉన్న chemicalsను గుర్తిస్తుంది. ఇది చూడ్డానికి ముక్కు లాగ ఉంటుంది, కానీ ఇది ముక్కు కంటే అధునాతనమైనది. ఇది ఫెరోమోన్లను కూడా గుర్తించగలదు, అలానే పిల్లులు తమ సహచరులను కనుగొనడంలో సహాయపడుతుంది. So, చాలా మందికి ఈ Jacobson’s organ - కొన్ని జంతువులలో ఉందని కూడా తెలియదు. కానీ ఒక "ఆదిమ శిల్పి" ఈ జాకబ్సన్ అవయవాన్ని మకర నోటి లోపల చెక్కినట్టు ఊహించుకోండి, అది ఉనికిలో లేదని మనం అనుకుంటాము. కాబట్టి, నా ప్రశ్న ఏంటంటే: 1000 సంవత్సరాల క్రితం జీవించిన శిల్పి, రుగే అని పిలువబడే ఈ ridgesను ఎలా చెక్కాడు? అలానే నోటి లోపల జాకబ్సన్ అవయవాన్ని కూడా ఎలా చెక్కాడు? ఇక్కడ రెండు అవకాశాలు ఉన్నాయి: మొదటిది ఏంటంటే, పురాతన శిల్పులు సజీవ మకరాన్ని modelగా ఉపయోగించారని మరియు దాని నోటిని పరిశీలించడం ద్వారా దీనిని చెక్కారని చెప్పడం, నేటి కళాకారులు ఖచ్చితమైన, శరీర నిర్మాణ వివరాలను సృష్టించడానికి, ప్రత్యక్ష నమూనాలను ఎలా ఉపయోగిస్తారో అదే విధంగా.
మీరు దీన్ని accept చేస్తే, మకరం 1000 సంవత్సరాల క్రితం ఉందని అలానే recentగా అంతరించిపోయిందని మీరు కూడా accept చేస్తున్నారని దీని అర్థం. దీని గురించి ఒక్కసారి ఆలోచించండి: గత కొన్ని శతాబ్దాల వరకు trunk మరియు feathersతో ఇంత అద్భుతమైన జంతువు ఉండేదా? రెండవది ఏంటంటే, పురాతన నిర్మాణదారులకు శరీర నిర్మాణ శాస్త్రంలో చాలా అధునాతన జ్ఞానం ఉందని మరియు పిల్లుల వంటి జంతువులలో, ఈ రుగే మరియు జాకబ్సన్ అవయవం గురించి తెలుసని అంగీకరించడం. వారు దీనిని study చేసి, ఆ వివరాలను ఈ పౌరాణిక జంతువు మకరపై ప్రతిబింబించాలని నిర్ణయించుకున్నారు. కానీ దీని అర్థం, ప్రాచీన భారతీయులు అధునాతన శరీర నిర్మాణ శాస్త్రం జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు, మీరు జంతువుల శరీర నిర్మాణ శాస్త్రం గురించి వివరాలను చూశారు, కానీ ప్రాచీన భారతీయులకు, మానవుల గురించి ఎంత తెలుసు? అదే ఆలయంలో, మానవుల గురించి కూడా మనం పుష్కలంగా చెక్కడాలను చూడవచ్చు.
ఇప్పుడు ఇక్కడ, మీరు చెక్కడాల శ్రేణిని చూడవచ్చు. ఇది నాకు చాలా interestingగా ఉంది. వాళ్ళు నిజానికి మాతృత్వాన్ని అడుగడుగునా చూపిస్తున్నారు. కాబట్టి, ఇక్కడ మీరు ఈ గర్భిణి తల్లిని చూడవచ్చు, సరేనా? ఆమె ఒక గర్భిణి తల్లి. మీరు ఆమెను పూర్తిగా గర్భవతిగా చూడవచ్చు. ఆమెకు పెద్ద belly ఉందని మీకు తెలుసు. and బహుశా ఆమె 8వ లేదా 9వ నెలలో ఉండవచ్చు. మీరు ఆమె ముఖాన్ని చూడవచ్చు. ఆమె depressionలో ఉందని స్పష్టంగా తెలుస్తుంది. మీరు పూర్తిగా గర్భిణీ తల్లులు, ఇలా depressionలో కూర్చున్నట్లు చెక్కబడిన carvingsను అనేక పురాతన భారతీయ దేవాలయాలలో చూడవచ్చు. ఇప్పుడు, నాకు interesting అనిపించిన విషయం ఏంటంటే, expertలు recentగా ఉన్న గర్భిణీ స్త్రీలకు 'Prepartum Depression' అనే Depression ఉందని "కనిపెట్టారు". ఇప్పుడు, బిడ్డను ప్రసవించిన తర్వాత, తల్లులు postpartum depressionకు గురవుతారని మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు, బిడ్డకు జన్మనివ్వక ముందే, వారికి ప్రీపార్టమ్ డిప్రెషన్ ఉందని కూడా కనిపెట్టారు. కానీ పురాతన భారతీయ దేవాలయాలలో దీనికి సంబంధించిన చెక్కడాలు ఉన్నాయి.
పూర్తిగా గర్భిణీ స్త్రీల, ప్రీ-పార్టమ్ డిప్రెషన్ యొక్క చెక్కడాలను వారు పదే పదే చూపించారు, మీరు ఆమె ముఖాన్ని చూడవచ్చు - ఆమె ఎంత డిప్రెషన్లో ఉందో అని. ఇప్పుడు, ఇది మాతృత్వంలో మొదటి అడుగు, సరేనా?
ఇప్పుడు ఇక్కడ, మరొక చెక్కడం ఉంది. ఇది ఒక అద్భుతమైన చెక్కడం. దీన్ని బాగా గమనించి, మీరు ఏం చూస్తున్నారో నాకు చెప్పండి? ఈ శిల్పాన్ని చూసి ప్రజలు ఎప్పుడూ confuse అవుతుంటారు. కానీ ఇది ఒక స్త్రీ, బిడ్డకు జన్మనిస్తుంది. ఇప్పుడు, ఈ స్త్రీ శరీరం నుండి శిశువు బయటకు రావడాన్ని మీరు చూడవచ్చు. శిశువు నమస్తే చేస్తూ బయటకు వస్తున్నట్లు కనిపిస్తోంది. కదా? And అది తల క్రిందికి వంగి ఉన్నట్లుగా బయటకు వస్తోంది, ఇదే బయటకు రావడానికి సాధారణ మార్గం. And బిడ్డను ప్రసవించే స్త్రీ పైన, ఆమెకు సహాయం చేసే నర్సును మీరు చూడవచ్చు, సరేనా? So, nurse, ఈ మహిళ పైన నిలబడి ఆమె మణికట్టును పట్టుకుంది. దీన్ని గమనించండి, ఇది చాలా ఒక మంచి detail. ఆమె తన మణికట్టును పట్టుకుంది, ఆమె తన చేతిని ఇలా పట్టుకోవడం లేదు. ఆమె తన మణికట్టును ఇలా పట్టుకుంది. ఇది నర్సులు మరియు మెడికోలు మధ్యలో, ఇది ఒక inside joke. బిడ్డను ప్రసవిస్తున్న మహిళకు మీ చేతిని ఇవ్వకూడదు.
ఎందుకంటే, ఆమె దాన్ని అంతగా నొక్కుతుంది, so, ఆమె మీ వేళ్లను విరిచేస్తుంది కూడా. So, మీరు మీ చేయి ఇవ్వకూడదు, అలాగే దానిని పెట్టుకోకూడదు. కానీ మీరు ఆమె మణికట్టును పట్టుకోవాలి. పురాతన ప్రజలకు దీని గురించి తెలుసు, ఎందుకంటే ఆమె గర్భిణీ స్త్రీ మణికట్టును పట్టుకున్నట్లు మీరు చూడవచ్చు. దానికి విరుద్ధంగా కాదు, ఎందుకంటే ఆమె దానిని చాలా గట్టిగా పిండి, ఆమె చిన్న ఎముకలను కూడా విరిచేలా చేస్తుంది. పురాతన ప్రజలకు ఈ వివరాలు తెలుసు. మీరు దిగువన మరొక నర్సును కూడా చూడవచ్చు, బిడ్డ కఠినమైన ఉపరితలాన్ని తాకకుండా చూసుకుంటోంది, కదా? So, ఆమె బిడ్డను సున్నితంగా ప్రసవించేలా చూసుకుంటోంది. ఇది రెండవ దశ. మీరు ఇక్కడ మూడవ దశను చూడవచ్చు, ఈ తల్లి ఇప్పుడు బిడ్డకు పాలు ఇస్తున్న మూడవ చెక్కడాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఆమె బిడ్డను ఎంత జాగ్రత్తగా పట్టుకుందో చూడండి. ఒక చేయి, బిడ్డ మెడ కింద ఉంది మరియు తల ఇలా ఉంది. మరొక చేయి బిడ్డ కింద భాగం పట్టుకుని ఉంది. అలాగే శిశువు కూడా తల్లిని ఇలా పట్టుకున్నట్లు చూపబడింది. పిల్లలు సాధారణంగా ఇలాగే చేస్తారు. వారు పాలు తాగేటప్పుడు తల్లి శరీరాన్ని పట్టుకుంటారు.
మీరు వాటిని step by stepగా చూడవచ్చు. ఇక్కడ బిడ్డను ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న తల్లిని మీరు చూడవచ్చు, అలాగే బిడ్డను ప్రసవించే తల్లిని మీరు చూడవచ్చు. And బిడ్డకు పాలును ఇస్తున్న తల్లిని మీరు చూడవచ్చు, సరేనా? ఇది హంగల్లోని, తారకేశ్వర ఆలయం అని పిలువబడే, 1000 సంవత్సరాల పురాతన ఆలయం. ఇది మాతృత్వాన్ని దశలవారీగా చూపిస్తుంది. ఇప్పుడు, మీరు ఈరోజు fertility clinicకి లేదా డాక్టర్ ఆఫీసుకి వెళ్తున్నారని ఊహించుకోండి. మీరు మీ ప్రసూతి వైద్యుడిని చూడటానికి వేచి ఉన్నప్పుడు సాధారణంగా మీరు చూసేది ఇదే. ఈ రోజు, ఈ పోస్టర్లు ప్రజలను విద్యావంతులను చేయడానికి పెట్టబడ్డాయని మనం స్పష్టంగా అంగీకరిస్తున్నాము, అవి మతపరమైన పోస్టర్లు కావు, సరేనా? మాతృత్వం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, ప్రాచీన భారతీయులు కూడా ఈ వివరాలను చెక్కే అవకాశం ఉందా? పురాతన భారతీయ దేవాలయాలలో, ఈ అసాధారణ శాస్త్రీయ వివరాలను మనం ఎందుకు చూస్తాము? ఈ వీడియోలో, నేను మీకు జంతువుల శరీర నిర్మాణ శాస్త్రం, రుగే మరియు జాకబ్సన్ అవయవం గురించి వివరాలను మాత్రమే కాకుండా, ప్రీపార్టమ్ డిప్రెషన్ మరియు మాతృత్వానికి సంబంధించిన ఇతర వివరాలను కూడా చూపించాను.
నేను వైద్యుడిని కాదు, కానీ నేను ఒకే ఒక పురాతన ఆలయంలో ఇంత సమాచారాన్ని కనుగొనగలిగితే, నిజమైన వైద్యులు ఈ పురాతన దేవాలయాలను చురుగ్గా అన్వేషిస్తున్నారని ఊహించుకోండి, వారు ఈ అద్భుతమైన ప్రదేశాలలో దాగి ఉన్న చాలా ఎక్కువ సమాచారాన్ని కనుగొనగలరు. So, మీరు డాక్టర్ లేదా శాస్త్రవేత్త అయితే, దయచేసి పురాతన భారతీయ దేవాలయాలను సందర్శించండి మరియు మీరు కనుగొన్న విషయాలను మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను, నా పేరు ప్రవీణ్ మోహన్, చూసినందుకు చాలా thanks, subscribe చేసుకోవడం మర్చిపోవద్దు, నేను త్వరలో మీతో మాట్లాడతాను. Bye!