ఎనిమిది కాళ్లు రెండు తలల విచిత్రమైన శిల్పం!|ప్రవీణ్ మోహన్|
Hey guys, India లో ఉన్న దారాసురం అనే గుడిలో ఉన్నాను. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ వింత జంతు శిల్పాన్ని ఎనిమిది వందల ఏభై సంవత్సరాలకు ముందు చెక్కారు. దీన్ని చూస్తేనే మీకు clearగ తెలుస్తుంది, దీనికి ఎనిమిది కాళ్లు ఇంకా వింతైన ముఖం ఉంది. వెంటనే చెప్పండి దీన్ని చూడగానే మీకు ఏమనిపిస్తుంది? దీనిలో మీరు ఏనుగును చూసారా లేదా ఎద్దును చూసారా? ఒక వేళా మీరు రెండింటిని చూసుంటే, congratulations - మీ brain చాలా sharpeగా పనిచేస్తుంది. దీనినే 2 in1 లేదా optical illusion శిల్పం అని అంటారు. మనము రెండు విధమైన ఆకారాలను ఒకే శిల్పంలో చూస్తున్నాం.
ఇప్పుడు నేను ఎడమ వైపుని మూసి వేస్తె, మీకు ఏనుగు కనిపిస్తుంది. మీరు దాని body ఇంకా తలను చూడవచ్చు. ఇక్కడ దీని కన్ను ఇంకా తిరిగి ఉన్న దీని తొండం కనిపిస్తుంది. నేను ఇప్పుడు కుడి వైపుకు వెళ్లి మిగిలిన సగం మూసేస్తే, మీరు ఎద్దుని చూడవచ్చు. మీరు వాటి నోరు, ముక్కు, కళ్లు అన్నీ చూడవచ్చు. మీరు దాని రెండు కొమ్ములను ఇంకా మోపురం కూడా చూడవచ్చు. మిగిలిన శరీరం మొత్తాన్ని చూసి మనం easyగానే అర్ధం చేసుకోవచ్చు. ఈ శిల్పం మొత్తం చిత్రాన్ని చూసినప్పుడు, ఈ రెండు జంతువుల శరీర భాగాలని ఎంత perfectతో కలిపారో అని మీరే బాగా చూడవచ్చు.
For example , ఆ ఏనుగు తొండాన్ని ఈ ఎద్దు మోపురంగా కూడా ఉంది. ఎద్దు యొక్క కొమ్ములు చెవులను, ఏనుగు నోరు తొండంగా చెక్కారు. అంతేకాక, ఈ శిల్పం ఒకే రాయితో చెక్కలేదు చూడండి. కుడి వైపున, ఏనుగు శరీరంలో ఉన్నఒక భాగాన్ని వేరే రాయితో చెక్కారు చూడండి. అలాగే దీనికన్నా చాలా విచిత్రంగా ఉండే శిల్పాన్ని నేను చూసాను. దాన్ని మహాబలిపురంలో కనిపెట్టారు, ఆ శిల్పంలో మీరు ఒక చిన్న ఏనుగు పిల్లను చూడవచ్చు and దూడను కూడా చూడవచ్చు. ఆ లింక్ వీడియో చివర లో పోస్ట్ చేస్తాను. ఈ రోజుల్లో ఇలాంటి భ్రమ పరిచే చిత్రాలను, psycologistsలు మీ right brained బాగా work అవుతుందా, లేదా left brained బాగా work అవుతుందా అని test చేయడానికి వీటిని వాడుతున్నారు.
so, ఇంకొక సారి చూసి correct గా మీరు ఏమి చూసారో చెప్పండి. ఎద్దు నా లేదా ఏనుగు నా? మీరు ఏమనుకుంటున్నారో comment section లో comment చేయండి. ఈ video చూసినందుకు చాలా thanks నేను మీ ప్రవీణ్ మోహన్, subscribe చేసుకోవడం మర్చిపోవద్దు, ఈ videoని like చేయండి and మీ friendsకి share చేయండి, త్వరలో మళ్ళి కలుస్తాను. bye..
- Praveen Mohan Telugu




















