ఈ పవిత్ర గదులను జైన సన్యాసులు సల్లేఖన కోసం ఉపయోగించారా?
Hey guys, ఈ రోజు నేను తిరుమలై కొండని చూపించబోతున్నాను ఇది చాలా పాతకాలపు place, ఇక్కడ కొండ పైన కొన్ని structures అలాగే కొండ కింద కొన్ని structures ఉన్నాయి, first మనం కొండ కింద ఉన్న structuresని చూద్దాం. ఇక్కడ చాలా గుడిలు ఉన్నాయి, అవి చూడడానికి హిందూ మతానికి చెందిన గుడిలు లాగ ఉన్నాయి, కానీ ఇవన్నీ జైన మతానికి చెందిన గుడిలు. ఈ place మొత్తం ఒక శక్తితో వెలిగిపోతుంది, ఇక్కడ ముప్పై కంటే ఎక్కువ చిన్న గదులు and గుహలు ఉన్నాయి. మనం ఈ లోపలికి వెళ్లి ఏముందో చూద్దాం రండి. ఈ ధ్వారం చూస్తేనే చాల చిన్నదిగా ఉంది, దీని లోపలికి వెళ్లడం కూడా చాల కష్టం.
కానీ లోపల చాల అద్భుతమైన విష్యం ఉంది, ఇక్కడ జైన మతంకి సంబంధించిన దేవుళ్ళ శిల్పాలు చాలా ఉన్నాయి. ఇవ్వన్నీ కనీసం వెయ్యి సంవత్సరాల పాత శిల్పాలు. ఈ విధంగా చెక్కినదాన్ని Bas-relief అంటారు, దీని వెనుక రాయి ఎలా ఉందొ అలానే వదిలేసి అందులో 2 dimensional బొమ్మలను చెక్కి చూస్తే ,రాయి లోపలి నుండి ఆ బొమ్మలు బయటికి వచ్చినట్టు ఉంటుంది. Bas-reliefని చెక్కడంలో జైనులు experts. ఇక్కడ ఒక స్త్రీ దేవత చెట్టు కింద నిలబడి ఉంది. కానీ ఈ చెట్టుని చూడండి చాలా విచిత్రంగా ఉంది కదా, అసలు ఇది ఎలాంటి చెట్టు? And ఈ rectangular slots ఇక్కడ ఏంచేస్తున్నాయి?
దీన్ని నేను ఇంకొక జైనులు placeలో already వివరించాను, ఆ placeని కలుగుమలై అంటారు, అక్కడ కూడా చాలా అద్భుతమైన చెక్కడాలు ఉన్నాయి. జైన సన్యాసులు ఉపయోగించిన కొన్ని పవిత్రమైన గదులకు వెళదాం రండి, దీని లోపల చాలా విచిత్రమైన విషయాలను మనం చూడబోతున్నాం. సహజమైన గుహాలతో పాటు ఇటుక గోడలు కూడా కట్టారు. ఇంచుమించు అన్ని జైన గుడిల్లో ఉన్న గదులు చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ గదుల్ని చాలా కారణాల కోసం ఉపయోగించారు. అందులో ఇది ఒక ముఖ్యమైన కారణం, అది ఏంటంటే సన్యాసులు శాశ్వతమైన ఆనందాన్ని సాధించాలని ధ్యానం చేసేవాళ్ళు. జైన సన్యాసులు చాలా సేపు ధ్యానం చేస్తారు అలా చేసే దాన్నిసమైక అంటారు, వీళ్ళు ధ్యానం చేసేటప్పుడు వాళ్ళ గతాన్ని అంటే pastని and futureని మర్చిపోయి, వాళ్ళ presentని మాత్రమే మనసులో పెట్టుకొని ధ్యానం చేస్తారు.
ఈ విధమైన concentrationని practice చేసి ధ్యానం చేయడానికి ఈ గదులను ఉపయోగించేవారు, జ్ఞానోదయం సాధించడానికి ఇలాంటి ధ్యానం ఒక మెట్టుగా అనుకునేవారు. ఇదే కాకుండా ఇక్కడ చీకటి గదులు కూడా ఉన్నాయి. ఈ గదులు చాలా differentగా ఉంటాయి. దీని లోపల, దేవుళ్ళ విగ్రహాలు ఏం లేవు కానీ, వీటికి బదులుగా ఒక chair and రాయితో చేసిన సాధారణమైన beds ఉన్నాయి. ఇది ఎలా use చేసుంటారు? కొంతమంది జనాలు దీన్ని సల్లేఖన కోసం use చేసారని చెప్తున్నారు. అసలు సల్లేఖన అంటే ఏంటీ? జైన మతంలో కొంతమంది సన్యాసులు అన్నం తినడం ఇంకా నీళ్లు తాగడం నెమ్మదిగా తగ్గించేసి ప్రాణం పోయేవరకు నిరాహార దీక్షలోనే ఉండేవారు. అలా వాళ్ళు నెమ్మదిగా తగ్గిపోయి, సన్నం అయిపోయి చివరికి అలానే చనిపోతారు. కొంతమంది దీనిని ఆచారంగా జరుగుతున్న ఆత్మహత్య అని చెప్పినప్పటికీ, జైనులు మాత్రం కర్మలను నాశనం చేసి పునర్జన్మను ఆపగలం అని అంటున్నారు.
ఇప్పుడు, మీరు అనుకోవచ్చు ఆ కాలంలో practice చేసిన పాతకాలపు అలవాటు అని, కానీ కాదు, ఇప్పుడూ కూడా జైనులు సల్లేఖన పద్దతిని follow చేస్తున్నారు. మన కాలంలో కూడా ఈ సల్లేఖన వల్ల ప్రతీ సంవత్సరం రెండు వందల నలభై మంది జైనులు చనిపోతున్నారు అని అంచనా వేస్తున్నారు. ఈ రోజుల్లో ఆత్మహత్య లేదా చనిపోవడం గురించి మాట్లాడడం కూడా తప్పు అని అంటున్నారు, కాని వాళ్ల చావుని వల్లే ఎంచుకునే హక్కు ప్రతీ వ్యక్తికి ఉందని పాతకాలపు Indian మతాలన్నీ చెప్తున్నాయి. And ఈ గదిలోనే జైనులు సల్లేఖనను practice చేసేవాళ్ళు, ఎక్కువగా ఈ గదిలోనే ఉంటూ చివరికి ఆకలితో చనిపోయేవాళ్లు. సరే, ఇప్పుడు మనం ceilingలో ఉన్నది చూద్దాం.
ఈ ceilings పైన natural vegetable colorsతో painting వేశారు, నిజంగా ఇక్కడ కొన్ని అద్భుతమైన paintings కూడా ఉన్నాయి. అయినా, కొన్ని paintingsని british వాళ్ళు కావాలనే నాశనం చేసారు, నేను ఇంతకు ముందున్న vimana technology videoలో already దీని గురించి చెప్పాను. ఆశర్యంగా ఉంది కదా! ఎందుకు ఎప్పుడూ చీకటిగా ఉన్న గదిలోనే ఇలాంటి మంచి మంచి paintings వేస్తారు. Doorని fit చేయడానికి దీన్ని use చేస్తారు. ఈ సాలెగూడు నుంచి, మనం గోడపైన ఉన్న knobని చూడవచ్చు. Already చీకటిగా ఉన్న ఈ గదికి ఒక గట్టి తలుపు పెడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి, ఇంకా చీకటిగా ఉంటుంది కదా.
ఇక్కడ సున్నంతో చేసిన structure కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ సన్యాసుల్ని చూపించే లాగా కూడా painting ఉంది. Ceiling పైన పువ్వులాంటి pattern కూడా చాలా అందంగా ఉంది. దీన్ని paint చేసిన కొత్తలో ఇది ఎంత brightగ ఉండేదో ఒకసారి ఊహించుకోండి. ఇక్కడ అరటి పువ్వుల్లాంటి paintings కూడా ఉన్నాయి చూడండి. ఇందులో ఒక విచిత్రమైన విష్యం ఏంటంటే ఈ ceiling ఐదు అడుగుల height కంటే తక్కువగా ఉంది. నేను straightగ నిల్చోలేకపోతున్న. ఎందుకు ఈ ceilingని ఇంత తక్కువ heightలో design చేసారు?