చెల్లప్ప కమిషన్ రిపోర్టు ఎప్పుడు వస్తుంది?
చెల్లప్ప కమిషన్ నివేదిక అందిన తర్వాత వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చే అంశం పరిశీలిస్తాం అన్నారంటే ప్రభుత్వం మరోసారి వంచించే ప్రయత్నం చేస్తోందని అనుమానం కలుగుతోంది. ఎందుకంటే అప్పుడేమో అత్యంత వెనకబడి ఉన్నారు.. గత ప్రభుత్వాలు మోసం చేశాయి. టీఆర్ ఎస్ ప్రభుత్వం తప్పకుండా వాల్మీకి బోయలను ఎస్టీలో చేరుస్తాం అని హామి ఇచ్చి ఇప్పుడేమో పరిశీలిస్తున్నాం అంటున్నారు.
కాబట్టి వాల్మీకి బోయ సోదరులారా జాగరుకులుగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఈ బడ్జెట్ సెషన్ లోనే ఎస్టీ రిజర్వేషన్ బిల్ ప్రవేశపెడతాం అన్నారు.. చెల్లప్ప కమిటీ రిపోర్టు(పూర్తి నివేదిక) ఆలోగా వస్తుందా? అన్న సందేహం కలుగుతోంది. వస్తే సరి లేదంటే పోరాటమే.

















