గద్వాల జిల్లా బహుజనులకు అడ్డా!
జోగులాంబ గద్వాల్ జిల్లా బహుజనులు గల ఖిల్లా. ఎందరో పోరాటాలు, ఉద్యమాలు పుట్టిన నడిగడ్డ జోగులాంబ గద్వాల. రెండు నదులు కృష్ణా, తుంగభద్ర ప్రవహిస్తున్నా.. ఇక్కడి ఇరిగేషన్, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ల అవినీతి ఆరోపణల వలన రోడ్లు, కాలువలు, వంతెనల పరిస్థితి ఈ నెల 14న జిల్లాకు వస్తున్న మంత్రులు, ఉన్నతాధికారులు అలంపూర్, శాంతినగర్, అయిజ, ఇటిక్యాల, మానపాడు, మాన్ దొడ్డి గ్రామాలను పరిశీలిస్తే కనబడుతుంది.
శనివారం అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం గారు సమీకృత మార్కెట్ యార్డు నిర్మాణానికి 15 కోట్లని అసలు రోడ్లే సరిగాలేవు ఇక మార్కెట్ కు ఎలా వస్తారు రైతులు..పంటకు సరైన గిట్టుబాటు ధర లేదు. చెప్పిన పంట వేయమంటారు పండించిన పంటను సగం వర్షానికి సగం పక్షులకు పోయేదాకా చూస్తూ ఉంటారు.. చివరికి రైతుకు మిగిలేది అప్పులే.., ఇక ఆర్టీసీ బస్ స్టేషన్ అభివృద్ధికి 4కోట్లు కేటాయించడం జరిగిందని ప్రెస్ నోట్లో వివరించారు. ఏ మారుమూల గ్రామానికి బస్సు వస్తుందో ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఎక్కడి రోడ్లు అక్కడే కంకర పోసి వదిలేసిన రోడ్లు అలంపూర్, అయిజ కు ప్రయాణం చేస్తే అర్థమవుతుంది. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై రోడ్లు ప్రమాదాలకు అడ్డాగా మారాయి. మొన్నటికి మొన్న ఒక యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు.
విద్య, ఉపాధిలో ఆమడ దూరమా?
ఇక్కడి రైతులు, కార్మికులు, కూలీలు, దళారుల కంబందహస్తాల్లో చిక్కుకొని బతుకుతున్నారు. అగ్రవర్ణ వర్గాలకు ఊడిగం చేస్తూ బానిసలుగా ఇన్నాళ్లు బతికారు. జిల్లాలో సుమారు 12 లక్షల జనాభా(2011 సెన్సస్ ప్రకారం 6లక్షల 64 వేల791 మంది) ఉంటుందని అంచనా. అక్షరాస్యత పరిశీలిస్తే 49.87% ఉంది. దీన్ని బట్టి ఇక్కడి బహుజనులకు విద్య, ఉపాధిని దూరం చేసి అదే బానిసలుగా బతకాలని వారి నుదుటన దేవుడు కాదు ఆనాటి, నేటి అగ్రవర్ణ పాలకులే రాసిపెట్టారని అనడంలో సందేహం లేదు. వారి చేతుల్లో బహుజన స్త్రీల జీవితాలు ఎంగిలి విస్తారాకుల్లా మారిన సంగతి తెలియదా? మొన్న 6ఏళ్ల గిరిజన బాలికను రేప్ చేసి చంపినా? ఇంతవరకు అతీ గతీ లేదు. అదే దిశ అనే అమ్మాయి విషయంలో జరిగిన న్యాయం మా బహుజనులకులేదే.. ఏం₹?
ఆరేళ్ళ గిరిజన పాపకు న్యాయం ఎక్కడ?
దళితులు, గిరిజనులకు వస్తున్న కేంద్రం, రాష్ట్ర నిధులు వేల కోట్లలో ఉన్నా.. అవి పక్కదారి పడుతున్నాయని లెక్కలు చెబుతున్నారు ఆర్ధిక నిపుణులు. వారికి దళిత వాడలు ఉండవు నగరం నడి బొడ్డులో భవంతులు కట్టిస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అటకెక్కినట్టే కనబడుతోంది. ఏజెన్సీ లో విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా వంటి రోగాలతో గిరిజనులు ప్రాణాలు పోతున్నా.. పాలకులకు కనబడదు. వారి మానప్రాణాలకు విలువ లేదు అన్నట్టే నడుచుకుంటోంది ఈ ప్రభుత్వం అని బహుజన సంఘ పెద్దలు ఎన్నోసార్లు ఉద్యమాలు, పోరాటాలతో, చివరికి వినతిపత్రాలు ఇచ్చి కాళ్ళు పట్టుకున్నా? న్యాయం జరుగుతుందన్న ఆశ వదులుకున్నారు.
బీసీలలో కొందరికేనా ఫలాలు!
ఇటు బహుజనులలో బీసీలైన యాదవులు, గౌడ్ లు, ముదిరాజ్ లు, బెస్త(తెలుగు), చాకలి, మంగలి వాళ్లలో కొందరికే ఫలాలు అందుతున్నాయి కానీ వడ్డెర, కురుమ, బోయ కమ్యూనిటీలలో 100కు పైగా ఉన్నా వారికి విద్య, ఉపాధి, సామాజిక, ఆర్ధిక పరిస్థితులు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. 4 లక్షలకు పైగా ఉమ్మడి మహబూబ్ నగర్ లో ఉన్న వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలోకి మారుస్తామని 2017 ఏప్రిల్ 16న ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా వారికి మధ్యలొనే వదిలేసిన వైనం.
కిందనుంచి పదవులు ఇవ్వలేరా?
బీసీల్లో కింద నుంచి ఉన్న వర్గాలకు ఎన్ని పదవులు ఇచ్చారో ఒక శ్వేతపత్రం విడుదల చేయండని, కులఘనన చేయాలని జాతీయ బీసీ సంఘం ఆర్ కృష్ణయ్య లాంటి పెద్దలు అడుగుతున్నా.. అటు కేంద్రానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి వినబడదంటున్నారు. జిల్లాలో పర్యటించే ముందు వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చామా? లేదా? అని ఒకసారి మనన చేసుకుంటే మీకు రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తారు లేదంటే బహుజనులదే ఇక అధికారం అని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ R.S ప్రవీణ్ కుమార్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.
- Venkateshwarlu Boya, Telangana Journalist