ఇది నిజంగా దేవాలయమేనా? చీకటి మూలలో దాక్కున్న పురాతన ల్యాబ్!
Hey guys, ఈ రోజు నేను మీకు మన కళ్ళ ముందే దాగి ఉన్న కొన్ని రహస్య శిల్పాలను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ మీరు ఏం చూస్తున్నారు? మీరు ఒక చేపను చూస్తున్నారా? మన కళ్లు సహజంగానే ఈ స్తంభాల వైపు, మరియు ఈ పెద్ద ద్వారం వైపు చూసి attract అవుతాయి, కానీ ఇక్కడున్న ఈ గోడను చూస్తే.. దీనిపై చెక్కిన ఒక చేపను మీరు చూడవచ్చు. దీన్ని, ఇక్కడ ఎందుకు చెక్కారు? దీనికి కారణం ఏమై ఉండవచ్చు? ఈ చేపను గొప్ప వివరాలతో చెక్కలేదు, అలానే దీన్ని సరిగ్గా పాలిష్ కూడా చేయలేదు, ప్రత్యేకంగా చెప్పాలంటే దీన్ని స్పష్టంగా చెక్కలేదు, అందుకే సాధారణంగా వచ్చే సందర్శకులు దీన్ని చూడలేరు.
అయితే, మనం దీనిని బాగా గమనించి పరిశీలించి చూస్తే, ఇది ఒక అలంకారమైన ఫాన్సీ ఐన చేప అని మనకు అర్ధమవుతుంది, దీని తోక మరియు రెక్కలతో సహా ఎన్ని రెక్కలను ఇక్కడ చూపించారో చూడండి. పురాతన నిర్మాణ దారులు, దీన్ని ఇక్కడ ఎందుకు చెక్కారు? ఇది ఒక రకమైన చిహ్నం లేదా సంకేతం అయ్యుండొచ్చు, కానీ ఎవరూ చూడని ప్రదేశంలో ఎందుకు దీన్ని చెక్కారు? ఇక్కడ, ఈ అందమైన ఏకశిలా స్తంభాన్ని అంటే ఒకే రాయితో చేసిన స్తంభాన్ని మీరు చూడవచ్చు, అది మాత్రమే కాకుండా, ఇక్కడ ఈ వివరాల యొక్క వివరాలను చూసి, మీరు చాలా సులభంగా మైమరచిపోతారు, అయితే 99% మంది సందర్శకులు ఇక్కడ ముద్దు పెట్టుకుంటున్న, ఈ జంట చేపలను చూడకుండా కోల్పోతారు.
కాని, వాటిని ఇక్కడ ఎందుకు చెక్కారు? ఈ చేపల యొక్క వివరాలను చూడండి, వీటిని చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. అయితే, వీటిని ఎవరూ చూడని ప్రదేశంలో, నేల నుండి 20 అడుగుల ఎత్తులో ఎందుకు చెక్కాలి? దీనికి అర్ధం ఏంటీ? నేను నా ఫోన్‌తో దీన్ని జూమ్ చేసి చూపిస్తాను, దీని తోకను చూడండి, ఇది ఒక exotic fish, అంటే మన ఇంట్లో fish tankలో పెంచుకుంటాము కదా అలంటి ornamental fish ఇది, ఇంత ఎత్తులో కూడా ఈ చెక్కడాన్ని చాలా అందంగా చెక్కారు. ఈ విధంగా, ఈ గుడి అంతటా చేపలను చెక్కాల్సిన అవసరం ఏముంది? పురాతన నిర్మాణ దారులు, ఈ చేపలను, ప్రజలు గమనించని విధంగా ఎందుకు చెక్కారు? నేను మీకు చూపిస్తున్నది, మీ కళ్ళ ఎదురుగా ఉన్నా కూడా మీరు దాన్ని చూడలేరు, ఎందుకంటే మీరు కేవలం మనుషులు మాత్రమే కదా.
మీ కళ్ళ ముందే ఈ చేపలు ఉంటాయి, కానీ 99% మంది ప్రజలు దీన్ని బాగా గమనించి చూస్తారు, కానీ ఈ చేపలను చూడడం పూర్తిగా miss చేస్తారు. సాధారణంగానే మనుషుల mind ఎలా ఆలోచిస్తుందని బాగా తెలుసుకొని, అందులో ఉన్న mistakesని ఉపయోగించి, పురాతన నిర్మాణ దారులు, కొన్ని విషయాలను, మన కళ్ళకు కనిపించకుండా దాచడంలో mastersగా ఉన్నారని అనిపిస్తుంది. ఇప్పుడు, ఈ symbolsను డాక్యుమెంట్ చేయడం లేదా వాటి వెనుక ఉన్న అర్థాన్ని కనిపెట్టడం వీటి గురించి మరచిపోండి, ఇక్కడ దాగి ఉన్న, అన్ని చేపల శిల్పాలను కనిపెట్టడం కూడా అసాధ్యమైన విషయమే. ఇలాంటి ప్రదేశాలలో, సందర్శకులు ఈ చేపలను గమనిస్తారు, వాళ్ళు వీటిని చూస్తారు అనేది చాలా ఆశించలేని ఒక విషయం.
నేను ఈ గుడికి, చాలా సార్లు వచ్చాను, అందుకే మీరు నన్ను చాలా రకాల dressesలో చూస్తున్నారు. Actually ఇప్పుడు చూశారంటే, గడ్డం కూడా పెరిగిపోయింది, కానీ నేను ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ చేపల శిల్పాలు ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిలో చాలా చేపలు చీకటి మూలల్లో దాగి ఉన్నాయి. ఎందుకు చాలా చేపలను చెక్కాలి? దీనికి ఏదో ఒక కారణం ఉండాలి, అంతే కదా? కానీ కొన్ని శిల్పాలలో, నేను చాలా interestingగా ఉన్న ఒక విషయాన్నీ కనిపెట్టాను. ఈ చేప చుట్టూ, ఒక rectangular shapeతో ఉన్న ఒక box ఉండడం మీరు చూడవచ్చు, ఈ rectangular, శిల్పం కోసం చెక్కిన కేవలం borderహా లేదా నిజంగానే ఒక container లోపల చేపలు ఉన్నట్టు చెక్కారా!
ఇది గ్లాస్ container లోపల ఉన్న చేపనా, అంటే నేనేం చెప్తున్నానంటే, మనం biology lab లో ఒక specimenని కనిపెట్టి, దాని external morphologyని ఎలా study చేస్తామో అదే విధంగా దీన్ని కూడా చెక్కి చూపించారు. ఇప్పుడు మీరు ల్యాబ్‌లో, చాలా రకాల చేపలను చూస్తే, బహుశా, మీరు కూడా వాటిని ఇలానే చూస్తారు. మీరు చేపలను చూస్తారు, అదే సమయంలో, మీరు దాని చుట్టూ ఉన్న ఈ glass containerను కూడా చూస్తారు కదా. ఈ ప్రాంతంలో ఉన్న అనేక శిల్పాలలో, ముఖ్యంగా చేపలు మరియు ఇతర జంతువులు లేదా మొక్కలను మనం చూడవచ్చు. ఇప్పుడున్న biologistలు, study చేస్తున్న విధంగా, ప్రాచీన భారతీయులు కూడా చాలా రకాల చేపల గురించి study చేసి వాటిని classify చేసి, document చేశారా?
ఈ రోజు ఈ చేపల యొక్క కొన్ని లక్షణాలను, ఎత్తి చూపడానికి వాటిపై లేబుల్స్ మరియు arrowsను పెట్టి చూస్తాము. ఇక్కడ, మనం రెండు చేపలను చూడవచ్చు, ఒకదాని తరువాత ఒకటి follow చేస్తూ వెళ్తున్నాయి, కానీ ఈ రెండు చేపలకు మధ్య ఒక arrow mark, అంటే ఒక triangle చెక్కినదాన్ని మనం చూడవచ్చు. అంటే దీనికి అర్ధం ఏంటీ? First ఉన్నచేప తోక ఇక్కడితో ముగుస్తుంది, కానీ దాని తర్వాత ఒక triangle ఉంది చూడండి, అది దాని తోక అని mark చేయడానికి ప్రయత్నించారేమో.
ఆ తరువాత ఇక్కడ మరొక చేప ఉంది. మళ్ళీ, ప్రతి చేప, ఒక biology lab లో ఉన్న ఒక సీసా లేదా గాజు కంటైనర్ వంటి పొడవైన rectangular లోపల ఉంది. And ఇక్కడ మనం ఈ చేపను చూడవచ్చు, కానీ దీనికి కళ్ళు లేవు. ఈ చేపలో ఎలాంటి ఫీచర్లు లేవు చూడండి. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, లోతైన మహాసముద్రాలు మరియు నదులలో అనేక రకాల blind fishes ఉన్నాయని మీకు తెలుసా? ఇక్కడ ఈ blind fishను చూడండి, దీనికి కళ్ళే ఉండవు, దాని శరీరాన్ని చూశారంటే, scales లేదా colors కూడా ఉండవు చూడండి.
- Praveen Mohan Telugu














