పురాతన ఆలయంలో ఇంపాసిబుల్ రాక్ కటింగ్ టెక్నాలజీ! భారతీయుడు తప్ప మరెవరూ ఇలా ఆలోచించలేరు?
Hey guys, ఒక పురాతన ఆలయంలో totalగా ఒక కొత్త stone టెక్నాలజీను నేను కనిపెట్టాను. ఇక్కడ కొంచం జాగ్రత్తగా గమనించండి: ఇది మెగాలిథిక్ structure ఆహ్? అంటే ఇది అనేక పెద్ద పెద్ద రాతి దిమ్మెలతో నిర్మించబడిందా? లేకపోతే ఇది ఒక ఏకశిలా ఆలయమా, అంటే ఇది కేవలం ఒక్క రాయితో నిర్మించబడిందా? మీరు నమ్ముతారో లేదో ఇది ఒక combination, అంటే రెండు కలిసిన ఒక కలవగా చేశారు, 1300 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలో పురాతన నిర్మాణదారులు ఈ రెండు నిర్మాణ సాంకేతికతలను combine చేసి పెట్టారు.
అదిగో ఆ line లోనే మెగాలిథిక్ construction పూర్తయ్యి మరియు monolithic construction ప్రారంభమవుతుంది. ఇలాంటి ఒక దృశ్యాన్ని చూడటం చాలా చాలా అరుదైన విషయం. మీరు ఈ లైన్ చూడండి; ఇది ఒక మేజికల్ ఐన మీటింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ లైన్ కి అటువైపున, ఒక నిర్మాణాన్ని నిర్మించడానికి పెద్ద పెద్ద రాళ్లను attach చేసి, జోడించి ఉండడం మీరు చూడవచ్చు, దీనినే మెగాలిథిక్ స్ట్రక్చర్ అని అంటారు. ఈ లైన్ కి ఇటువైపున చూసుకుంటే, టన్నుల కొద్దీ రాళ్లను తవ్వి బయటకు తీయడాన్ని మీరు చూడవచ్చు, ఇలాంటి నిర్మాణాన్ని రూపొందించడానికి తొలగించే సాంకేతికతను monolithic structure అని అంటారు.
ఇంకా ఈ రెండు construction techniquesలను ఈ లైన్లో కలిసే విధంగా చేశారు. మన ఛానెల్లో ఉన్న వీడియోలను మీరు చూశారంటే, నేను మీకు కైలాస దేవాలయం లాంటి పెద్ద పెద్ద monolithic structuresలను చూపించాను, అంతేకాకుండా అనేక మెగాలిథిక్ దేవాలయాలను కూడా నేను మీకు చూపించాను. కానీ ఈ రెండింటిని కలిపిన విధంగా ఒకే ఆలయంలో ఉపయోగించడాన్ని చూస్తుంటేనే చాలా అర్చర్యంగా ఉంది, ఎందుకంటే ఇది అసాధ్యం అనే చెప్పాలి, ఇంతకు ముందెన్నడూ ఇలాంటిదాన్ని నేను చూడలేదు మరియు ఈ వివరాలను ఇంకెవరూ కనిపెట్టిఉండరని నేను అనుకోను, ఎందుకంటే పురాతన నిర్మాణదారులు వాటిని చాలా సులభంగా కలిపారు.
మీరు beams మరియు స్తంభాలను చూసినప్పుడే, ఇక్కడ ఉన్న తేడాలను మీరు గ్రహించడం ప్రారంభిస్తారు. మీరు ఈ వైపు చూశారంటే, వాళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద రాయి బ్లాక్స్ లతో తయారు చేశారని మరియు మీరు ఈ jointsలను చూడగలరు. కానీ ఈ స్తంభాన్ని చూడండి, దీనికి ఏ joints కూడా లేవు, ఎందుకంటే దాని చుట్టూ ఉన్న బండను తొలగించే దీనిని తయారు చేశారు. నేను ఇక్కడ వ్రాసిన వాటిని చూస్తుంటే, దీనికంటే చాలా విచిత్రమైన విషయం కనిపిస్తుంది. ఇక్కడ ఈ శాసనాలలో సంస్కృతం మరియు తమిళం కలిపిన 2 ప్రాచీన భాషలు ఉన్నాయి. మీరు 2 స్క్రిప్ట్‌లను పక్కపక్కనే చూడవచ్చు. ఇది చాలా విచిత్రమైన ఒక కలయికగా ఉంది, ఎందుకంటే ఈ రెండు ప్రాచీన భాషలు పూర్తిగా వేర్వేరు మూలాలను కలిగి ఉన్నాయని మరియు పురాతన కాలంలో అవి సహజీవనం చేయలేదని experts చెప్తున్నారు.
కానీ ఇక్కడ, 1,300 సంవత్సరాలకు ముందు వాటిని కలిసి ఉపయోగించడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అయితే, వాళ్లు ఇంత పెద్ద రాతి దిమ్మెను ఇక్కడ ఎలా ఉంచారని మీరు ఆశ్చర్యపోవచ్చు, కచ్చితంగా వాళ్ళు ఇలాంటి ఒక పెద్ద రాతి దిమ్మెను తరలించి ఇక్కడ ఉంచలేరు, అలా జరగడానికి సాధ్యమే లేదు. ఇది కొండలో ఒక భాగం మాత్రమే, ఇది బయటి నుండి ఎలా ఉంటుందో అని నేను మీకు చూపిస్తాను, ఈ నిర్మాణం కొండతో కలసి ఎలా నిర్మించబడిందని మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మెగాలిథిక్ construction ఉంది, మరియు కొండ యొక్క ముఖంలో ఈ monolith construction ఉంది. అయితే, ఈ గది మెయిన్ ఛాంబర్ లోపల టన్నుల టన్నుల కొండ రాళ్లను బయటకు తీసి తయారు చేశారు.
అసలు ఈ ప్రధాన గది లోపల ఏం ఉంది? లోపల చాలా పెద్ద లింగం ఉంది, అది కూడా కొండలో ఒక భాగమే. మన దగ్గర ఫ్లాష్లైట్లు ఉన్నప్పటికీ, మనకు లింగం స్పష్టంగా కనిపించట్లేదు, దాని outlines మాత్రమే కనిపిస్తున్నాయి. actually ఈ స్థలం చాలా చీకటిగా ఉంది, మంచి ఫ్లాష్ లైట్లను ఉపయోగించినప్పటికీ, దీన్ని మాత్రమే నేను record చేయగలిగాను. నేను నా DSLR నుండి ఫ్లాష్ లైట్ ని ఉపయోగించినప్పుడు, నేను ఒక సెకను మాత్రమే లింగాన్ని స్పష్టంగా చూడగలిగాను. ఈ ప్రదేశం ఏఒక్క వెలుతురు లేకుండా ఎలా ఉంటుందో అని నేను మీకు చూపిస్తాను, ఇది దాదాపు నల్లగా ఉంది, మీ పక్కన ఎవరు నిలబడి ఉన్నారని కూడా మీరు చూడలేరు, అయితే ఇలాంటి ఒక చీకటి ప్రదేశంలో పురాతన నిర్మాణదారులు ఈ నిర్మాణాన్ని ఎలా నిర్మించగలిగారు?
కానీ ఇది కేవలం నిర్మాణాన్ని నిర్మించడం గురించి కాదు, ఇక్కడ ముఖ్యమైన విషయమే ఈ వివరాల గురించే. ఈ పెద్ద శిల్పాన్ని చుడండి, ఇది దాదాపు 7 లేదా 8 అడుగుల పొడవుగా చాలా పెద్దగా ఉంది, ఈ చీకటిలో కూడా వాళ్ళు ఇతనిపై చెక్కిన వివరాలను చూడండి. అతని బెల్ట్ ని చూడండి, దానికి ఉన్న buckle మరియు రెండు వైపులా వేలాడుతున్న పట్టీలను చూడండి. గోడపై కూడా కొన్ని వింత గుర్తులు, రాతలు ఉన్నాయి. Expertsలు దీనిని analyze చేసి చూసి, ఇది భారతదేశంలోని సంగీతం గురించిన అతి పురాతనమైన శాసనాలు అని కనిపెట్టారు.
ఇది కర్ణాటక సంగీతంలోని 7 సప్తస్వరాలను అంటే స,రి,గ,మ,ప, ద,ని అని అంటాము కదా, ఆ 7 స్వరాలను చూపిస్తుందని చెప్తున్నారు. అయితే వాళ్లు దానిని ఈ చీకటి ప్రాంతంలో ఎందుకు దాచి పెట్టారు, ఇలాంటి విలువైన సమాచారాన్ని ఎవరూ యాక్సెస్ చేయకూడదని ఎందుకు అనుకున్నారు? అయితే ఇప్పుడు మనం మళ్లీ construction techniquesల దగ్గరకు వెళ్దాం రండి, పురాతన నిర్మాణదారులు ఈ అద్భుతమైన ఏకశిలా పనిని చేయడం మాత్రమే కాకుండా, ఈ ఆలయ సముదాయంలో కొన్ని అద్భుతమైన మెగాలిథిక్ పనిని కూడా చేసారు.
- Praveen Mohan Telugu

















