చోళ రాజులు శివుని చెవి రింగులలో రహస్య కోడ్ పెట్టారా?
Hey guys, ఈ రోజు నేను మీకు కనుచూపు మేరలో దాచిన, శివుని గురించి, ఒక రహస్యాన్ని చూపబోతున్నాను. అది ఏంటని మీరు ఊహించగలరా? చెవి రింగులు. అవును, ఈ పురాతన విగ్రహాన్ని చూడండి. మీరు ఎడమ చెవి ringను చూసారా? And కుడి చెవి రింగ్? ఆ రెండు ఒకటి కాదు; అవి చూడ్డానికి ఒకేలా ఉండవు. ఒకటి పొడవుగా ఉంది, మరొకటి roundగా ఉంది, కదా? కానీ శిల్పి పొరపాటు చేసి ఉండవచ్చు, కదా? కాదు. ఈ పురాతన శిల్పాన్ని చూడండి. మళ్ళీ, ఈ చెవి రింగులు differentగా ఉన్నాయి. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, మీరు శివుని యొక్క గొప్ప భక్తుడు లేదా భక్త హిందువు కూడా అయి ఉండవచ్చు, కానీ మీరు ఈ వివరాలను ఎప్పుడూ గమనించలేదని నేను పందెం వేస్తున్నాను. ఎందుకు? ఎందుకంటే ఇది జ్ఞానం కోల్పోయింది. ఈ చెక్కడాన్ని చూడండి: మళ్ళీ, చెవిరింగులు differentగా ఉన్నాయి. నిజానికి, ఈ వివరాలు చాలా స్థిరంగా ఉన్నాయి: శివుని కుడి వైపున ఉన్న చెవి రింగ్ పొడవుగా ఉంది, నిజానికి అతని earlobe కూడా పొడవుగా ఉంది, అతని చెవి రింగ్ అతని భుజానికి పడుతుంది చూడండి. శివుని ఎడమ చెవిపై, పెద్ద, గుండ్రని, బోలుగా ఉన్న ఇయర్ రింగ్ ఉంది. కానీ ఎందుకు? First of all, మీరు ఎప్పుడైనా ఎడమ వైపున ఒక ఇయర్ రింగ్, కుడి వైపున మరొక ఇయర్ రింగ్ ధరిస్తారా? ఒక్కసారి మీరే ఆలోచించండి, ఎడమ పాదానికి తెల్లని షూ, కుడి పాదానికి నల్లని షూ వేసుకుని బయటకు వెళ్తారా?













