శిల్పాలలో దాగి ఉన్న శిల్పుల అద్భుత సృష్టి! 1300 సంవత్సరాలకు ముందు చెక్కిన ఆప్టికల్ ఇల్యూజన్ శిల్పం!
Hey guys, నేను ఇప్పుడు భారతదేశంలో ఉన్న మామల్లపురంలో ఉన్నాను, దీన్ని7వ శతాబ్దంలో నిర్మించారు. So, కనీసం1300 సంవత్సరాల క్రితం తయారు చేసిన శిల్పాల గురించే, మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఈ స్తంభాలలో, ఒకదానిపై చెక్కిన, ఈ అద్భుతమైన optical illusion చెక్కడాన్ని నేను చూసాను. ఈ రకమైన illusionను కొన్నిసార్లు 2 ఇన్ 1 శిల్పం అని పిలుస్తారు.
ఈ శిల్పాన్ని మీరు casualగా చూస్తే, ఆవు మరియు దూడ కనిపిస్తాయి, తన తల్లి దగ్గర ఈ దూడ పాలు తాగుతున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ, ఈ ఆవు కొమ్ములను, ఆవు దూడ తలను నాలుకతో పామడం, ఆవు యొక్క నాలుగు కాళ్ళు, అలానే దాని తోకను కూడా మీరు చూడవచ్చు. ఇది చూడడానికి సాధారణ శిల్పం లాగానే కనిపిస్తుంది. అయితే, మీరు మీ చేతిని ఈ మధ్యలో పెట్టి చూస్తే, ఒక ఏనుగును మరియు పిల్ల ఏనుగును చూడవచ్చు.
ఇప్పుడు మీరు ఏనుగు తొండం, కాళ్ళు మరియు తోకతో పాటు మొత్తం శరీరాన్ని చూడవచ్చు. పిల్ల ఏనుగు తన ముఖం దొండం ఎదురుగా చూస్తూ, తల్లి కాళ్ళ మధ్యలో నిలబడి ఉంది. ఇది unbelievable ఉంది కదా? మళ్ళీ చెప్తున్నాను, ఈ చెక్కడం కనీసం 1300 సంవత్సరాల క్రితం చెక్కినది. కాబట్టి మనం ఇప్పటివరకు చూసిన optical illusion శిల్పాలలో చాలా పురాతన శిల్పాన్ని చూస్తున్నామని అనుకుంటున్నాను, దీన్ని చెక్కినది మన భారతీయులే.
- Praveen Mohan Telugu
















