ఈ నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు! Gmapలో కనిపించని శిథిలమైన పురాతన ఆలయం!
Hey guys, ఈ రోజు, నేను ఒక పురాతన హిందూ దేవాలయాన్ని వెతుకుతున్నాను, ఆ దేవాయలం కనీసం వెయ్యి సంవత్సరాల నాటిది కావచ్చు. రండి మనం వెళ్లి పరిశీలించి, అక్కడ ఏమి కనుగొనగలమో అని చూద్దాం. కొత్తమంగళం అనే గ్రామంలో పాడుబడిన ఒక దేవాలయం ఉందని కొందరు చెప్పారు, అయితే ఇందులో beauty ఏంటంటే, ఈ గ్రామం గూగుల్ మ్యాప్‌లో కూడా లేదు, మ్యాప్ లో దీనికి పక్కన ఉన్న కాట్టూర్లో అనే గ్రామం మాత్రమే ఉంది, కాబట్టి ఆ ఆలయం ఎక్కడ ఉందని కనిపెట్టడానికి నేను ఈ గ్రామానికి వచ్చి వెతుకుతున్నాను. ఓహ్ అక్కడ చూడండి... ఒక పెద్ద విష్ణుని విగ్రహం ఉంది.
అదిగో అక్కడ కనిపిస్తున్నదే ఆ శిధిలమైన దేవాలయం ఫ్రెండ్స్. మనం వెతుకుతున్న ఆ పురాతన దేవాలయం ఇదే. ఫస్ట్ నేను నా షూలను తీసేస్తాను, తర్వాత అక్కడ ఉన్న వాటిని మనము కనిపెట్టడానికి start చేద్దాం. మొదట విష్ణు భగవానుని విగ్రహాన్ని చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నది బ్రహ్మాండమైన విష్ణు విగ్రహం. ఇది దాదాపు 5 లేదా 6 అడుగుల పొడవు ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే... ఇది నిజంగానే విష్ణుని విగ్రహమా? లేకపోతే ఇది వేరొక దేవుడి విగ్రహమా? ఇది విష్ణువు అని నేను ఎలా గుర్తించానంటే? ఈ స్పష్టమైన చిహ్నమే... విష్ణునికి మాత్రమే ఈ విధంగా నామం వేస్తారని మన అందరికి బాగానే తెలుసు, కానీ ఇది కొత్తగా వేసిన నామం అని మీరు చెప్పవచ్చు. కానీ మీరు ఇక్కడ ఇతర వివరాలను కూడా చూడవచ్చు.
for example, ఇక్కడ శంఖం ఉండడాన్ని మీరు చూడవచ్చు. ఇది విష్ణువు యొక్క స్పష్టమైన చిహ్నం. ఈ విధంగా పడుకుని ఉన్న pose ని మనం శయన విష్ణువు అని పిలుస్తాము, ఇక్కడ ఆయన ఒక చేతిని ఈ విధంగా తల కింద ఉంచి నిద్రిస్తున్నారు మరియు ఆయన పవిత్రమైన దారం వేసుకుని ఉన్నారు ఇంకా చూసుకుంటే చాలా ఆభరణాలు వేసుకుని ఉన్నారు, అది మాత్రమే కాదు, పెద్ద చెవిపోగులను కూడా వేసుకుని ఉన్నారు. అయన తలపైన ఉన్న కిరీటం కూడా మన చూడవచ్చు కాబట్టి ఇది విష్ణునుని విగ్రహమని సందేహం లేకుండా కంఫర్మ్ చేయవచ్చు. సాధారణంగా, విష్ణువు పాదాల కింద లక్ష్మి అని పిలవబడే ఆయన భార్య ఉంటారు, కానీ ఇక్కడ ఆమె లేదు, ఇది ఏకశిలా విగ్రహం, అంటే ఇది ఒకే రాతితో చేయబడింది, ఇంకా ఇక్కడ విష్ణువు యొక్క పాదాల మందాన్ని చూపించే లోతును మీరు ఇక్కడ చూడవచ్చు, realisticగా కనిపించేలా చెక్కారు.
ఇది ప్రత్యేకంగా ఉంది కదా. అయన ముఖాన్ని చూడండి, చాలా శాంతంగా కనిపిస్తున్నాడు మరియు ఒక రహస్యమైన చిరునవ్వుతో ఉన్నాడు. అక్కడ ఒక ఎత్తైన ఇటుక గోపురం ఉంది, కానీ దాని కంటే ముందు మీరు పూర్తిగా గ్రానైట్‌తో చేసిన మరొక నిర్మాణాన్ని చూడవచ్చు. మనం దీని దగ్గరికి వెళ్దాం రండి, ఇక్కడ పొట్టిగా, లావుగా ఉన్న జీవి శంఖం ఊదుతూ నన్ను పలకరించింది. ఇతను ఎవరు? ఇతను hairstyle చాలా ఫ్యాన్సీగా విచిత్రంగా ఉంది, కానీ ఈ గుడిని పట్టించుకోని కారణంగా, ప్రతిదీ పూర్తిగా పాడైపోయింది. ఇతను పెద్ద చెవిపోగులను వేసుకుని ఉన్నాడు, ఇంకా తన బొడ్డుపై బెల్ట్ లాంటి వస్తువును కూడా ధరించాడు. మొదట్లో దీన్ని కట్టిన వాళ్ళు, వదిలి వెళ్లిపోయాక, దాని తర్వాత వచ్చిన వాళ్ళు, వాళ్లకు ఉన్న knowledge తో దీన్ని పునర్నిర్మాణ చేయడానికి ప్రయత్నించారని నేను దీన్ని చుసిన వెంటనే కనిపెట్టాను.
ఎడమ వైపు ఉన్న ఈ స్థూపాకార స్తంభం కింద ఒక rectangular షేప్ లో ఉన్న బ్లాక్ supportగా ఉండడం మీరు చూడవచ్చు, అదెలాగానే కుడి వైపు ఉన్న స్తంభం పైభాగంలో ఒక చిన్న cylindrical బ్లాక్‌ను దాని ఎత్తుకు తగ్గట్టుగా adjust చేసి పెట్టుండడం మీరు చూడవచ్చు. ఇది పురాతన నిర్మాణదారులు చేసిన ఒక ఇంజనీరింగ్ mistake అని మీరు అనుకోవచ్చు, కానీ, మీరు జాగ్రత్తగా చూస్తే, మిగతావన్నీ ఒకే రంగులో ఉన్నాయని ఇంకా కుడి వైపు స్తంభం యొక్క రంగు వేరుగా ఉన్నాయని మీరు గ్రహిస్తారు. కొన్ని శతాబ్దాలకు ముందు ఇలాంటి అసంపూర్ణ renovation చేశారు, అందుకే ఇది విచిత్రంగా కనిపిస్తుంది, కానీ అదృష్టవశాత్తూ, ఈ శిల్పాలన్నీ original గా ఉన్నాయి. ఇవన్నీ చాలా విలువైన శిల్పాలు. అది మాత్రమే కాకుండా ఇవి చాలా చాలా interesting ఐన శిల్పాలు.
ఇందులో చాలా interesting ఐన కథలు కూడా ఉన్నాయి. ప్రతి శిల్పం మనకు పురాతన గ్రంథాల నుండి ఒక కథను చెబుతుంది. ఈ శిల్పాన్ని కొంచెం చూడండి. ఇది చాలా విచిత్రమైన కథ, ఇక్కడ ఒక మనిషి లాంటి వ్యక్తి ఒక పక్షి ముక్కును పట్టుకుని ఉన్నాడు. actually ఈ వ్యక్తి మరెవరో కాదండి, ఇది సాక్షాత్తూ శ్రీకృష్ణుడు, పక్షి రూపంలో ఉన్న రాక్షసుడిని చంపుతున్నాడు. ఈ రాక్షసుని పేరు బకాసురుడు మరియు కృష్ణుడు దాని ముఖాన్ని రెండుగా విడదీస్తున్నాడు. ఇక్కడ సగం మనిషి సగం సింహంగా ఉన్న నరసింహ దేవుడు, ఈయన కూడా ఒక రాక్షసుడిని పట్టుకుని ఉన్నాడు. ఈ శిల్పాల combinationను చూస్తుంటే చాలా interestingగా ఉంది కదా, పైన ఉన్న శిల్పాన్ని కింద ఉన్న శిల్పాన్ని చుడండి, కింద జంతువు ఆకారంలో ఉన్నదీ చెడుగా, మానవరూపంలో ఉన్నదీ మంచిదిగా ఉంది, కాబట్టి ఇక్కడ జంతువు నాశనం చేయబడుతోంది.
ఇంకా పైభాగంలో, జంతువు ఆకారంలో ఉన్నదీ మంచిదిగా, మరియు మానవరూపంలో ఉన్నదీ చెడుగా ఉంది, కానీ ఇక్కడ మానవరూపంలో ఉన్నదీ చంపబడుతోంది. ఇప్పుడు, మీరు హిందువు కాకపోతే ఇది మీకు నిజంగా గందరగోళంగా ఉంటుంది, ఎందుకంటే పురాతన హిందూ మతం యొక్క concept ఏంటంటే, మీరు ఏ మతం వారైనా సరే, మంచి గెలుస్తుంది, చెడు. అందుకే హిందూమతాన్ని ధర్మం అని చెప్తారు, అంటే ధర్మం లేదా విశ్వ చట్టం అని సూచించబడింది.
- Praveen Mohan Telugu















