పురాతన భారతీయ సింహిక శిల్పం! విదేశీయులతో రహస్య సంబంధంలో ఉన్న పల్లవ రాజులు!
Hey guys, ఈరోజు మనం south indiaలో ఉన్న మహాబలిపురంలో ఉన్నాము, ఇక్కడ సింహిక యొక్క శిల్పం ఒకటి ఉంది, సింహిక అంటే ఏంటని అడుగుతున్నారా, సింహిక అంటే గ్రీక్ పురాణాలలో చెప్పిన ఒక జంతువు, దానికి మనిషి ముఖం, సింహం శరీరంతో పక్షి రెక్కలతో ఉంటుంది, ఇక్కడ మనం చూస్తున్న సింహిక శిల్పాలలో మొదటి దానికి నరసింహ స్వామి ముఖం ఉంది, ఈయన భారతదేశంలోని గొప్ప రాజులలో ఒకరు.
ఇప్పటి వరకు మహాబలిపురంలో ఉన్న అనేక శిల్పాలకు ఆయనే బాధ్యత వహించారు. ఈజిప్ట్‌లో ఉన్న గిజా పిరమిడ్ చాలా famous అని మనందరికీ తెలుసు, గీజలో ఉన్న సింహిక శిల్పంలో ఫారోహ్ ఖఫ్రా అనే ఈజిప్ట్ రాజు యొక్క ముఖం ఉంటుంది, Great sphinx of gizaని, 2500 B.C లో నిర్మించారు. మహాబలిపురంలో మీరు చూస్తున్నది, దానికంటే చాలా చాలా చిన్నది, ఇది కొన్ని అడుగుల పొడవు మాత్రమే ఉంటుంది, మరియు గిజాలో ఉన్న sphinx కంటే ఇది కొత్తది, అలానే దీన్ని, కేవలం 1300 సంవత్సరాల క్రితమే చెక్కారు.
దీనిలో మొదట నరసింహవర్మన్ యొక్క ముఖం మరియు సింహం యొక్క శరీరం ఒకటిగా ఉన్నట్టు చెక్కారు. సాధారణంగా దేవుళ్ళకు sharpగా ఉండే ముక్కులాగ కాకుండా దాని ముక్కు ఎలా గుండ్రంగా ఉందో మీరే చూడండి. అతని శక్తి మరియు మగతనానికి చిహ్నంగా అతను పెద్ద మీసాలతో ఉన్నారు చూడండి. So, 1300 సంవత్సరాలకు ముందు, నరసింహవర్మ రాజు ముఖం ఇలానే ఉండేది. ఈ సింహికకు ఎడమ వైపున ఒక సాధారణం సింహం ఉంది, కుడి వైపున, సింహం శరీరంతో, డేగ ముఖంతో కూడిన శిల్పం ఉంది చూడండి.
ఈ రకమైన జంతువులను గ్రీకు పురాణాలలో గ్రిఫిన్ అని అంటారు. So, భారతదేశంలో ఉన్న చెక్కడాలు, ఈజిప్షియన్ మరియు గ్రీకు శిల్పాలత ఎలా సంబంధం కలిగి ఉన్నాయో చూడండి. నేను భారతీయ గుడులలో అనేక సింహిక శిల్పాలను చూశాను, కానీ ఇది ఒక్కటి మాత్రమే చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది దేవుడికి బదులుగా ఒక మనిషి యొక్క ముఖాన్ని చూపుతుంది. Please, మీ thoughtsలను comment sectionలో comment చేయండి, నేను మీ ప్రవీణ్ మోహన్, వీడియో చూసినందుకు చాలా thanks, subscribe చేసుకోవడం మర్చిపోవద్దు, మరియు త్వరలో మీతో మాట్లాడతాను.
- Praveen Mohan Telugu











