మనం అలా అనుకోవడం తప్పా? పిరమిడ్‌ను మొదట నిర్మించినది తెలుగువాళ్లేనా?
Hey guys, ఈ రోజు మనం శ్రీలంకలో చాలా పురాతన ప్రదేశమైన సిగిరియాలో నిజంగానే ఏముందో అని చూడబోతున్నాము. సిగిరియా అనేది ఒక పెద్ద రాయి, దీని పైన చాలా ఆశ్చర్యమైన శిధిలాలన్నీ ఇంచుమించు నాశనమైన స్థితిలో ఉన్నాయి. ఈ శిధిలాల గురించి officialగా చెప్తున్నా కథ ఏంటంటే, ఇక్కడ సగం వరకు చెదిరిపోయిన ఈ ఇటుక గోడలన్నీ ఒక కోటలో మిగిలినవని అంటున్నారు, దీన్ని క్రీ. శ. ఐదువందల(500) సంవత్సరంలో కాశ్యప అనే రాజు కట్టిన భవనం అని archeologistలు, historianలు చెప్తున్నారు. కానీ, ఈ వీడియో ముగిసే లోపు ఇది పూర్తిగా తప్పు అని మీరు కూడా నాతో పాటు ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను, ఈ placeలో చాలా ప్రత్యేకమైన నిర్మాణం ఉన్నాయని మీరు ఒప్పుకుంటారు.
ఇక్కడ ఒక పెద్ద నిర్మాణం ఉంది చూడండి, ఇది ఇటుకలతోనే తయారు చేసారు, experts ప్రకారం ఈ ప్రాంతమే ఒక భవనం అని, దాని చుట్టూ ఉన్న మిగతా నిర్మాణాలన్నీ కాలక్షేపం కోసం gardens కొలను అని చెప్తున్నారు. ఇక్కడ రాజభవనమని పిలవబడే ఈ place కొలతలు చూసుకుంటే, 60 అడుగుల పొడవు ఇంకా 30 అడుగుల వెడల్పు ఉంది. దీని అర్ధం ఏంటంటే, ఈ భవనం మొత్తం 2000 square feet కంటే చాలా చిన్నదిగా ఉంది, ఇది ఒక భవనం అని చెప్పలేము, ఎందుకంటే ఇందులో కనీసం 10 గదులు కూడా రావు. సరే, ఇప్పుడు మనం ఇది రాజుగారి చిన్న భవనం అని అనుకుంటే, అతని భార్యలు, ఇంకా ఇక్కడ పని చేసిన సేవకుల ekkaduntaru?
వంట చేయడానికి, నిల్వ చేసుకోవడానికి ఇంకా స్నానం చేయడానికి వీటన్నిటికీ గదులు ఎక్కడున్నాయి? అతని సైనికులు, పూజారులు ఇంకా మంత్రులు వీళ్ళందరికీ గదులు ఎక్కడున్నాయి? అతని కాపలాదారులు ఎక్కడ విశ్రాంతి తీసుకుంటారు? ఇది చూస్తే మీకే తెలుస్తుంది, ఈ place మొత్తం చాలా చిన్నదిగా ఉంది, కచ్చితంగా ఇది రాజుగారి భవనం అనడానికి chance ఎహ్ లేదు. Archeologistsలు ఈ placeకి నాలుగు వైపులా పలకలు పెట్టారు, ఈ రాజభవనం యొక్క నాలుగు వైపులు అని ఈ పలకల పైన రాసి ఉంది. ఈ boardని చూడండి, దీని పైన west palace అని రాసి ఉంది, అంటే ఇది రాజభవనంకి పడమర వైపు అని అర్ధం.
ఇదే విధంగా మిగతా పలకలు కూడా ఉన్నాయి, దక్షిణం వైపు ఒక boardలో reception hall అని కూడా రాసి ఉంది. ఈ రోజుల్లో, కనీసం medium sizeలో ఉన్న ఒక ఇంటికి, ఈ మొత్తం place సరిపోతుంది. అంతే కాకుండా, పాతకాలపు స్థపతిలు దీని చుట్టూ ఒక రక్షణ కోసం అడ్డంకులను చేసారు, ఈ సిగిరియా పైకి ఎవరూ రాకూడదని నీరు ఇంకా రాళ్లను ఉపయోగించి రక్షణ వ్యవస్థను ఏర్పరచడం మనం already చూశాము. ఇంత పెద్ద రక్షణ వ్యవస్థను ఇంత కష్టపడి సృష్టించి, నేలమట్టంలో చూసుకుంటే మైళ్ళ వరకు ఈ రక్షణ వ్యవస్థ విస్తరించి ఉంది, ఇదంతా ఈ రాయి పైన ఉన్న చిన్న రాజభవనం కాపాడడం కోసమేనా. నిజానికి చెప్పాలంటే, అసలు ఈ place మొత్తం ఒక ఇల్లు కానీ, లేదంటే ఒక రాజభవనం కానీ, లేదంటే నివసించడానికి kanisam ఒక place కూడా కాదు, ఈ place మొత్తాన్ని వేరే ఏదో ఒక ముఖ్యమైన విషయం కోసం కట్టారు.
ఇది ఒక రాజభవనం కాకపోతే, ఇక్కడ అసలు ఏముండేది? ఇప్పుడు, ఇక్కడ మూలలు ఇంకా అంచుల దగ్గర ఇటుకలతో ఎలా కట్టారో చూడండి. ఇది కచ్చితంగా ఒక రాజభవనం కానీ, ఒక కోట లాంటి సాధారణమైన rectangular construction kuda కాదు, ఇలాంటి కట్టడాలన్నీ కట్టాలంటే, నేలనుండి 90 డిగ్రీల angleలో గోడల లాంటి నిర్మాణాలే కట్టాలి. ఇది మనం బాగా గమనించి చూస్తే, ఒకప్పుడు ఇది ఒక pyramidగా ఉందని అర్ధం చేసుకోవచ్చు. జాగ్రత్తగా చూడండి, ఈ ఇటుక గోడలు కింది నుండి ఒకదాని పై ఒకటని పై పైకి నేరుగా ఎలా పోతుందో కదా? Pyramids అన్నిఈ విధంగానే ఉంటాయి, అన్ని pyramidలకు base పెద్దగా ఉంటుంది, అది కింది నుండి అలా పైభాగం వరకు వెళ్తూ వెళ్తూ ఇరుకుగా చిన్నగా మారుతుంది.
ఈ జారుతున్న placeని మీరు ఈ building కి ఏ వైపు నుండి కూడా చూడవచ్చు, ఈ ఇటుక గోడల నిర్మాణం పైకి పోను పోను ఇరుకుగా చిన్నగా మారుతుంది. So, ఇది కచ్చితంగా ఒక pyramidగా ఉండుంటుంది, అయితే ఇందులో ఇంకొక విచిత్రమైన విషయం కూడా ఉంది, అది ఏంటంటే ఇది ఒక stepped pyramid, ఇందులో చాలా levels అంటే చాలా steps ఉన్న ఒక pyramid. ఇక్కడ చూడండి, and ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ pyramid యొక్క steps, ఇంకా మనం పైకి ఎక్కి వెళ్ళడానికి ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి. చూడండి, ఈ పెద్ద level పైన కూడా మనం దర్జాగా నడవగలము.
ఈ మొత్తం structureలో ఇలాంటి steps చాలా ఉన్నాయి. నేను మిగతా historians లాగనో లేదంటే archeologist లాగనో కథ చెప్పడంలేదు, మన కళ్ళకు clearగా కనిపిస్తున్న ఆధారాలను మీకు చూపిస్తున్నాను, ఇదే ఈ pyramid యొక్క ముందు భాగం, మనం ఈ మెట్లు ఎక్కి పైవరకు పోదాం రండి. Of course, ఈ pyramid యొక్క పైభాగంలో, సగ భాగం ధ్వంసం అయిపోయింది, అసలు కారణం ఏంటని ఎవరికీ తెలియలేదు. ఇదే ప్రస్తుతానికి ఇక్కడున్న ఈ pyramid యొక్క top level, అలానే ఈ ఇటుకలన్నీ వరుసలో ఎలా ఉన్నాయో, చూస్తేనే చాలా విచిత్రంగా ఉంది.
ఈ ఇటుకలన్నీ నిలువుగా కూడా పెట్టలేదు, చూడండి ఏవో కొన్ని విచిత్రమైన కారణాల వల్ల వంకర వంకరగా పెట్టారు, చూస్తుంటే దాదాపు ఒక పాము శరీరం లాగానే ఉంది. ఇది ఎందుకు ఇలా పెట్టారని ఇప్పటివరకు నాకు ఎలాంటి idea లేదు కానీ, ఇది పెట్టడానికి కచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని నాకు అనిపిస్తుంది. నా ఉద్దేశ్యం ఏంటంటే, పాతకాలపు స్థపతిలకు ఇవన్నీ సరిగ్గా ఎలా కట్టాలో తెలియక వాళ్ళు ఇలా వంకర వంకరగా కట్టలేదు, ఎందుకంటే ఇక్కడ చూడండి, సరిగ్గా ఎలా కట్టాలో వాళ్లకు బాగానే తెలుసు కానీ, వాళ్ళు చేసిన చాలా విషయాలు ఇప్పుడు మనం చేయాలనుకున్న కూడా చేయలేము.