తలైవాకు తప్పని హ్యాకింగ్ ఇటీవలే కాలంలో సినిమాలు ఫైరసీలు కావడం...ప్రముఖుల ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్లు హ్యాకింగ్ కావడం సాధారణమైపోయింది.ఇప్పుడు తాజా సూపర్ స్టార్ ఆ తిప్పలు తప్పలేదు. రజనీ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. తలైవా ట్విట్టర్లో రజనీ అనుసరిస్తున్న వారిక కంటే ఎక్కువ మంది నటీనటులను, మీడియాను ఫాలో అవుతుండడం, సాధారణంగా ఎక్కువ యాక్టివిటీ ఉండని ఆయన ట్విట్టర్ ఖాతా ఒక్కసారిగా అసాధారణ రీతిలో యాక్టివ్‌గా మారింది. దీంతో ఆయన అభిమానులు రజినీకి సమాచారం అందించారు. సూపర్ స్టార్ ట్విట్టర్ హ్యాక్ అయిందని తెలుసుకున్న వెంటనే రజినీ ఆల్‌లైన్ బృందం సభ్యులు అన్ని చర్యలు చేపట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. హ్యాకింగ్ వెనకున్న వారికోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. రజినీ కుమార్తె ఐశ్వర్య ధనుష్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. రజనీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తించి సమాచారం అందించిన అభిమానులకు ధన్యావాదాలు తెలిపారు.