చేతబడులు చేస్తున్న ఎల్లోరా గుహ! మనుషులను హింసించే మర్మమైన గుహలు!
Hey guys, ఇప్పుడు నేను ఎల్లోరా cave complexలోని వింతైన గుహను మీకు చూపించబోతున్నాను, దీనిని ఇక్కడున్న ప్రజలు సాధారణంగా "ది ఈవిల్ కేవ్" అంటే దయ్యాల గుహ అని పిలుస్తారు. ఈ వీడియో యొక్క first partలో archeologistsluలు, Historiansలు చెప్పేవన్నీ ఎంత వరకు నిజం ఎంత వరకు అబద్ధం అని నేను మీకు చూపించాను. ఈ second partలో నేను మీకు ఒక ఆశ్చర్యమైన evidenceని చూపించబోతున్నాను. ఏంటంటే tortureతో కూడుకున్న కొన్నిభయంకరమైన కథలను ఇక్కడ ఉన్న జనాలు నాతో చెప్పారు.
ఇది first గుహ, దీని గురించి archeologists and historians ఏం చెప్తున్నారంటే, ఇది ఒక Buddhist cave అంటే భౌద్ధుల గుహ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న problem ఉంది. అదేంటంటే ఇది first buddhist గుహనే కాదు. ఒకవేళ ఇది భౌద్ధుల గుహ లేదా ఆశ్రమమే అని అనుకున్నాకూడా ఇక్కడ బుద్ధుడికి సంబంధించిన విగ్రహమైన, స్తూపమైన, చెక్కాడమైన లేదా ఒక symbol లైన ఉండాలి కదా. ఈ ఎల్లోరాలో ఉన్న 34 గుహల్లో, ఈ గుహలో మాత్రమే ఎలాంటి దేవుళ్ళ శిల్పాలు లేవు.
ఈ areaలో మొట్టమొదటిగా చెక్కిన గుహ ఇదే అయి ఉండవచ్చు అని archeologistsలు అనుకుంటున్నారు, కానీ ఈ గుహ ఎందుకు కట్టారో అని అర్థం కాక వాళ్ళు తికమకపడుతున్నారు. ఇది భౌద్ధుల గుహ కాకపోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది, ఏంటంటే ఈ గుహ మధ్యలో ఒక బలిపీఠం ఉంది. ఈ పెద్ద బండరాయిని బలిపీఠం అని అంటారు, ఇలాంటివి ఇండియాలో మనకు చాలా placeలలో కనిపిస్తాయి. ఇప్పుడు ఇది భౌద్ధుల గుహ కాదని మనకు clearగా తెలిసిపోయింది, ఎందుకంటే భౌద్ధ సన్యాసులు మనుషులనైనా, జంతువులనైనా బలిగా అర్పించరని మన అందరికి బాగానే తెలుసు కదా.
archeologistsలకు వాళ్ళు చెప్పేది నిజం కాదని వాళ్ళకే తెలుసు కాబట్టి ఈ విధంగా ఒక రాతి పలకలో రాసి ఇక్కడ పెట్టారు. ఈ రాతి పలకలో ఏం ఉందంటే, ఇది stone cutters కోసం కట్టిన ఒక ఇల్లు అయుండొచ్చు అని, ఇంకా దాని తర్వాతే ఈ భౌద్ధ సన్యాసులు దీనిని ఉపయోగించారని అందులో రాసి ఉంది. అయితే వీళ్లకు ఒక్క ఇల్లు కట్టడానికి యాభై సంవత్సరాలు ఎందుకు పట్టింది? అనే ప్రశ్నను నేను అడగట్లేదు. ఇంకా ఈ 8 చిన్న సెల్స్లో 1200 కంటే ఎక్కువ స్టోన్ కట్టర్లను ఎలా ఉంచారు అని నేను కూడా అడగను.
అయితే ఈ ఇల్లుల లోపల స్టోన్ కట్టర్లు ఉపయోగించి చేసిన నేలను గమనించండి. ఈ ఫ్లోర్ చూస్తున్నారు కదా, ఇక్కడ పడుకోవడానికి అసలు వీలు లేకుండా ఉంది, ఈ floor flatగా కాకుండా ఎత్తులు తగ్గులుగా ఉంది. ఈ సన్యాసులు ఇంకా స్టోన్ కట్టర్లు 1500 సంవత్సరాలకు ముందు జీవించిన ఆదిమ ప్రజలు అని కొందరు argue చేయవచ్చు. ఇంకా కొందరు వాళ్ళు పాతకాలపు మనుషులు, ఏ విధంగానైనా జీవించగలరు అని కూడా argue చేయవచ్చు. కానీ బౌద్ధ సన్యాసులు ఇంకా రాతి కట్టర్లు నిజంగా నిద్రపోవడానికి వాడిన గుహ, పక్కనే ఉన్న ఇంకొక గుహ.
ఈ పాతకాలపు మనుషులు 1500 సంవత్సరాలు తర్వాత కూడా మనకి easyగా అర్థం అవ్వడానికి వీళ్ళు రాతితో నున్నటి ఒక బెడ్ని తయారు చేయడం మాత్రమే కాకుండా ఒక దిండును కూడా ఇక్కడ తయారు చేసుకున్నారు. So ఈ గుహను బౌద్ధ గుడిగా నిర్మించకపోతే లేదా దీనిని ఎవరైనా నివాసంగా ఉపయోగించకపోతే, ఈ గుహ యొక్క purpose ఏంటి? దీన్ని ఎందుకు కట్టుంటారు? అందుకే ఈ మర్మమైన గుహ గురించిన రహస్యాలను తెలుసుకోవాలని నేను ఇక్కడ ఉన్న స్థానికులను అడగడం start చేసాను.
ఇక్కడున్న జనాలు దీన్ని ‘దుశ్ కుహ’ అని పిలుస్తారు, అంటే ఒక దయ్యాల గుహ అని అర్థం, ఇంకా రాత్రుల్లో ఈ గుహ లోపలికి ఏ జంతువైనా వెళ్తే, అవి అపహరింపబడి వేరే ప్రపంచానికి తీసుకెళ్లబడతాయి అని వీళ్ళు నమ్ముతున్నారు. ఇంకా మరో ప్రపంచంలో నుండి వచ్చిన జీవుల లాగ వాళ్ళ పూర్వికులలో చాలా మంది ఆ విధంగా హింసించబడి కొన్ని రకాల వింత చేతబడులకు గురయ్యారని కూడా వాళ్ళు చెప్పారు. Of course, ఇవన్నీ వింటుంటే ఆధారాలు లేని పుకార్లుగా ఉన్నాయి కదా, కానీ ఈ వింత కధలన్నీ నిజాలే అని నేను మీకు కొన్ని అయినా ఆధారాలను చూపిస్తాను.
ఇప్పుడు, మీరు ఈ గోడపైన చెక్కిన రకరకాల holesలను చూడండి. వీటిని దూరం నుండి చూస్తే just holes లాగే కనిపిస్తాయి, దగ్గరకు జాగ్రత్తగా గమనించి చూస్తే తెలుస్తుంది, ఇవి నిజమైన హోల్స్ కాదు రాళ్లతో చేయబడిన బిగింపులని. దీని ద్వారా ఒక తాడుతో దేనినైనా లేదా ఎవరినైనా గోడకు కట్టేయొచ్చు అనుకుంట. అయితే ఈ బిగింపులను మనుషుల్ని కట్టేయడానికి ఉపయోగించారా? అలా అయ్యుంటే ఇక్కడున్న జనాలు చెప్పిన మాట నిజమే కదా.
In fact, వీళ్ళలో ఒకరు చెప్పిందేంటంటే ఈ గోడల నుండి ప్రజలను తలక్రిందులుగా కట్టి వేలాడదీసేవాళ్ళని నాకు చెప్పారు. కచ్చితంగా అది కూడా అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఈ నేల నుండి 12 అడుగులపైన కూడా కొన్ని బిగింపులు వేసున్నారు చుడండి. ఇంత ఎత్తులో ఉన్న ఈ వింత బిగింపులను పెట్టడానికి కారణం ఏంటి? ఇప్పుడు మనం rectangular shapeలో ఉన్న ఈ గదుల entranceని గదుల్లోకి ఎంత పర్ఫెక్ట్గా చెక్కారో చుడండి. ఒకప్పుడు ఈ గదులను మూసివేసే తలుపులు ఉండేవని మీరు కూడా చూడవచ్చు.
అసలు నిద్రపోవడానికి కూడా వీలులేని ఇలాంటి చిన్న గదులకు ఇంత perfect అయిన తలుపులు ఎందుకు? ఈ గదులను తలుపులతో పూర్తిగా close చేసేస్తే లోపల fullగా చీకటిగా అయిపోయి, వెలుపలి గాలి లోనికి పోవడానికి కూడా chance ఉండదు. అంటే వీటిని జైలు గదులుగా లేదా చిత్రహింసలు పెట్టడానికి ఉపయోగించే గదులుగా వాడి ఉంటారా? అంటే వీటిని జైలు గదులుగా లేదా చిత్రహింసలు పెట్టడానికి ఉపయోగించే గదులుగా వాడి ఉంటారా?
- Praveen Mohan Telugu













