Drop outs have life in Dr. B.R. Ambedkar Open University!
ఈ యూనివర్సిటీలో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు!
డాక్టర్ బీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ దూరవిద్యా విశ్వవిద్యాలయం ఎంతో మంది నాలా మధ్యలో చదువు మానేసి ఉన్నత విద్యను అభ్యసించి లబ్ది పొందినవారు లక్షల్లో ఉన్నారు. 1982లో NT రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విశ్వవిద్యాలయం మొదలైంది. 1991లో డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ గా మారింది. హైదరాబాద్ నగరంలో సువిశాలమైన ప్రాంగణంలో ప్రకృతి అందాలతో రమణీయంగా ఉంటుంది క్యాంపస్. సైన్స్ అండ్ టెక్నాలజీ ముల్టి ల్యాబ్, పెద్ద లైబ్రరీ, అడ్మినిస్ట్రేషన్ భవనం, ఆధునిక తరగతి గదులు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి.
నేను 2000-01లో డాక్టర్ బాబూ జగ్జీవన్ రావు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ డ్రాప్ అవుట్ ను. అప్పుడు ఇల్లు గడవడానికి పెయింటింగ్ పనులు చేసుకుంటూ క్లాస్ లకు హాజరు కాలేదు. అది ముందే సైన్స్ క్లాస్, పాస్కల్ థియరీ లు, ల్యాబ్ వర్క్స్ చాలా మిస్ అయ్యాను. హాజరు శాతం లేదని ప్రాక్టికల్ ఎగ్జామ్ రాయనీయలేదు లెక్చరర్. దీంతో డ్రాప్ అవుట్ కావాల్సి వచ్చింది. మళ్ళీ కంటిన్యూ చేద్దామన్నా ఫీజులకు భయపడి డిస్టెన్స్ లో డా. బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో బీ ఏ పూర్తి చేశాను. అప్పుడు జరిగిన పొరపాటు అది నాదా, దిద్దే లెక్చరర్లదా తెలియదు. నా డిగ్రీ మార్కుల శాతం 44.88 గా వచ్చింది. దీంతో అప్పట్లో బీఈడీ చేయాలన్న కోరిక చచ్చిపోయింది. అప్పుడు బీఈడీ చేయడానికి 45శాతం ఉండాలి. అలా విధి నాతో చెలగాటం ఆడింది. అయినా వదలకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ ఎంట్రన్స్ రాసి 16వ ర్యాంక్ తో క్యాంపస్ సీట్ సంపాదించి ఈ2 హాస్టల్లో ఉండి జర్నలిజంలో పీజీ పూర్తి చేశాను. రెండో ఏడాదిలో క్యాంపస్ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయి ఐన్యూస్ లో 5+1=6 ఏళ్ళు ప్రోగ్రామింగ్ డిపార్ట్ మెంట్ లో పని చేశాను. అలా నాకు ఓదారి చూపింది డా. అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ.