యోగులకు మాత్రమే తెలిసిన రహస్య గడియారం? నీడతో కాలాన్ని అంచనా వేసిన పూర్వీకులు!
Hey guys, ఈ రోజు నేను క్రీ.శ. పన్నెండు వందల యాభైలో(1250), భారతదేశంలో కట్టిన కోణార్క్ సూర్యుని గుడిలో ఉన్నాను, Sundial అంటే సూర్యరశ్మి గడియారం ఎంత కచ్చితత్వంగా ఉంటుందో అని ఈరోజు మనం చూద్దాం, ఇప్పటికి కూడా ప్రజలు timeని చూడడానికి ఈ గడియారాన్ని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు, first ఒక చిన్న వీడియో క్లిప్‌ను చూడండి, ఇందులో ఒక టూర్ గైడ్ timeని ఎలా కనిపెడుతున్నారని చూడండి, ఆ తరువాత ఈ సూర్యరశ్మి గడియారం ఎలా పనిచేస్తుందని నేను మీకు చెప్తాను.
ఈ sundial చాలా కచ్చితమైన timeని చూపిస్తుంది చూడండి, ఇక్కడికి వచ్చిన ప్రజలు అందరూ దీనిని చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు, దీన్ని బాగా పరిశీలించి, ఇది ఎలా పనిచేస్తుందని చూద్దాం. ఇందులో ఎనిమిది పెద్దముల్లులు ఉన్నాయి, ఈ పెద్ద ముల్లులే 24 గంటలను, ఎనిమిది సమాన భాగాలుగా విభజిస్తుంది, అంటే రెండు పెద్ద ముల్లుlaకు మధ్య మూడు గంటల సమయం ఉంది. ఇంకా ఇందులో ఎనిమిది చిన్న ముల్లులు కూడా ఉన్నాయి, ఒకొక్క చిన్న ముల్లు సరిగ్గా రెండు పెద్దముల్లులకు మధ్యలో ఉంది.
దీని అర్ధం ఏంటంటే, ఈ చిన్న ముల్లు, ఆ రెండు పెద్దముల్లులకు మధ్య ఉన్న మూడు గంటల సమయాన్ని, సగానికి విభజిస్తుంది, అంటే ఒక పెద్ద ముల్లుకు అలాగే చిన్న ముల్లుకు మధ్య గంటన్నర సమయం అంటే 90 నిముషాల సమయం ఉంటుంది, ఇప్పుడు ఈ చక్రం యొక్క అంచున చూడండి, చాలా పూసలు ఉన్నాయి. మీరు దీన్ని బాగా గమనిస్తే, ఒకొక్క చిన్న ముల్లుకు, ఒక పెద్ద ముల్లుకు మధ్య సరిగ్గా 30 పూసలు ఉన్నట్లు మీరు చూస్తారు.
So, ఈ 90 నిముషాలు, 30 పూసలుగా విభజించారు, అంటే ప్రతీ ఒక్క పూస మూడు నిమిషాల సమయాన్ని చూపిస్తుంది, ఈ పూసలు తగినంత పెద్దవి, కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ నీడ పూసకి మధ్యలో పడినా లేదా పూసకి ఏదైనా ఒక చివరల్లో పడినప్పుడు మనం కచ్చితంగా ఈ సమయాన్ని నిమిషముగా లెక్కించవచ్చు. ఈ సూర్యరశ్మి గడియారం anti-clockwise directionలో, సమయాన్ని చూపిస్తుంది, పైన ఉన్న ముల్లు అర్ధరాత్రిని చూపిస్తుంది, ఈ ముల్లు పగలు మూడు గంటల సమయాన్ని చూపిస్తుంది, అలాగే ఇది పగలు ఆరు గంటల సమయాన్ని చూపిస్తుంది, ఈ విధంగానే అన్ని సమయాలు చెప్పొచ్చు.
ఇప్పుడు నా వేలు లేదా ఒక pen తీసుకొని, ఈ రాయిలో ఉన్న జంతువు తోక దగ్గర పెడితే దాని నీడ, ఈ చక్రం అంచుపైన పడుతుంది. ఇప్పుడు, ఏ పూసపై నీడ పడిందో నేను note చేసుకుంటాను, తర్వాత, మనము ఇంతకు ముందు చేసిన లెక్కను ఉపయోగించి, ఇప్పుడు నేను చాలా accurateగా ఎంత time అవుతుందని మాత్రమే కాదు, ఎన్ని నిముషాలు అవుతుందని kooda exactగా చెప్పగలను. ఏడువందల యాభై(750) సంవత్సరాలకు ముందు ఇలాంటి ఒకదాన్ని తయారుచేయడానికి, astronomers అంటే ఖగోళ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అలానే దీన్ని చెక్కిన శిల్పులు వీళ్ళ మధ్య ఎంత coordination తో ఇంకా వాళ్ళ సమయాన్ని ఎంత కేటాయించుంటారో అని ఒకసారి మీరే imagine చేసుకొని చుడండి ఇప్పుడు మీరు దీన్ని బాగా గమనించి చూశారంటే, మీ మనసులో రెండు ప్రశ్నలు మొదలవుతాయి.
మొదటి ప్రశ్న ఏంటంటే, సూర్యుడు తూర్పు నుండి పడమర వైపుకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది. ఈ చక్రాన్ని గోడపైన చెక్కారు కాబట్టి, మధ్యాహ్న సమయంలో ఈ చక్రంపై అసలు సూర్యుని వెలుతురు పడదు. మరి మధ్యాహ్నం ఎలా సమయాన్ని చెప్తాము? అందుకోసమే కోణార్క్ గుడిలో ఇంకొక సూర్య గడియారం కూడా ఉంది, అది ఈ గుడికి పడమర వైపున ఉంది. మధ్యాహ్నం నుండి సూర్యుడు అస్తమించిన వరకు చాలా perfectగా పని చేసే, ఈ గడియారాన్ని మీరు use చేసుకోవచ్చు. ఇప్పుడు రెండవ ప్రశ్న ఏంటంటే, ఇది చాలా interesting అయిన ప్రశ్న. సూర్యుడు అస్తమించిన తరువాత సమయాన్ని ఎలా చెప్తారు?
ఆ సమయంలో సూర్యుడు ఉండడు కాబట్టి, సూర్యాస్తమయం నుండి మరుసటి roju ఉదయం వరకు నీడలు ఉండవు. ఈ గుడిలో ఉన్న రెండు సూర్య గడియారాలు, పగలు సూర్యుడు ప్రకాశించినప్పుడు మాత్రమే పని చేస్తాయి. మరి రాత్రి సమయంలో? ఈ ప్రశ్నకు కూడా సమాధానం ఉంది, ఇక్కడ కేవలం రెండు చక్రాలు మాత్రమే కాదు, ఈ గుడిలో ఇలాంటి చక్రాలు మొత్తం ఇరవై నాలుగు చక్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఈ సూర్య గడియారం లాగానే చాలా perfectగా చెక్కారు. మీరు moondial గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ sundials లాగానే, రాత్రి సమయంలో moondials పని చేస్తాయి, ఈ విషయం మీకు తెలుసా?
ఒకవేళ ఇక్కడ ఉన్న మిగతా చక్రాలన్నీ moondials లాగ use చేసుంటారేమో చాలామంది ప్రజలు ఈ గుడిలో ఉన్న మిగతా ఇరవై రెండు చక్రాలు కేవలం అలంకార కోసమో లేదా మతపరమైన ప్రయోజనాల కోసమో చెక్కారని అనుకుంటున్నారు. మొదట్లో ఈ రెండు సూర్య గడియారాలు గురించి కూడా ఇలానే అనుకున్నారు. మీరు నమ్ముతారో లేదో కానీ, ఈ ఇరవై నాలుగు చక్రాలు కేవలం అందం కోసం అలానే హిందూ చిహ్నాలుగా చెక్కారని, మొదట్లో ప్రజలు అనుకున్నారు. సుమారు వంద సంవత్సరాలకు ముందు, ఒక వృద్ధ యోగి రహస్యంగా సమయాన్ని లెక్కించడం కనిపించినప్పుడే, ఇది ఒక సూర్య గడియారం అనే విషయం తెలిసింది.
కొంత మంది వ్యక్తులు, ఈ చక్రాలను తరతరాలుగా use చేస్తున్నారని తెలిసింది, ఒకటి రెండు కాదు మొత్తం ఆరువందల యాభై సంవత్సరాలుగా ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉంది. ఆ తరువాత మిగిలిన చక్రాలు గురించి, ఆ యోగి దగ్గర అడిగినప్పుడు అతను ఏం సమాధానం ఇవ్వకుండా, మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. అలానే ఈ రెండు సూర్య గడియారాలు గురించి, మనకున్న జ్ఞానం కూడా నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ. ఇక్కడ చూడండి, ఇందులో round roundగా చాలా పూసలు ఎలా ఉన్నాయో చూడండి.
- Praveen Mohan Telugu















