స్వామి అయ్యనార్ నిజమైన చరిత్ర..! ఈ దేవుడే ప్రపంచంలోని మొదటి దేవుడా?
Hey guys, ఈ రోజు మనం కాంచీపురంలో ఉన్న కైలాసనాథుని గుడి యొక్క ముఖ్య విషయాలను చూడబోతున్నాము. ఇది చాలా పురాతన గుడి, ఇది క్రీ.శ 700 సంవత్సరాలలో కట్టారని archeologistలు అంచనా వేస్తున్నారు, అంటే దీన్ని ఇంచుమించు పదమూడు వందల సంవత్సరాలకు ముందే కట్టుంటారు, అయినప్పటికీ, ఇది దానికంటే పాతదని ఈ ఊరు జనాలు నమ్ముతున్నారు. ఈ గుడిని అన్ని హిందూ గుడులకు మూలమని అంటారు అంటే, ప్రపంచంలో ఉన్న అన్ని హిందూ గుడుల కంటే మొదటిగా కట్టిన హిందూ గుడి ఇదే అని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు.
మనం ఈ గుడిలోపలికి వెళ్ళడానికి ముందే ఈ గుడిలో కొన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయని మనకు తెలిసిపోతుంది, ఈ గుడి గోడల బయట ఈ పెద్ద square ఉంది కదా అది ఏంటీ? ఇది ఒక పెద్ద ఎద్దు, ఇదే శివుని వాహనం, నంది అని అంటారు, దీన్ని గుడి బయట ద్వారానికి ఎదురుగా పెట్టారు. ఇప్పుడు ఉన్న హిందూ గుడులకు బయట నందిని చూడటం చాలా rareగా ఉంది, ఇది చాలా పాతకాలపు గుడి అని చెప్పడానికి దీన్నే గుర్తుగా చెప్పొచ్చు. ప్రపంచంలోనే చాలా పెద్ద ఏకశిలా నంది అంటే ఒకే రాయిలో చేసిన నంది శిల్పం. ఇది పాతకాలపు లేపాక్షి గుడిలో ఉంది, అది కూడా గుడి బయటే ఉంది. And ఒక మూలలో గుడికి కావలసిన నీళ్లు కోసం కోనేరు కూడా ఉంది చూడండి.
ఈ కోనేరు నీటిని నిల్వ చేసుకోవడానికి కట్టారు, and ఇది తిరగేసిన పిరమిడ్ shape లాగ ఉన్న designలో చేసి కట్టారు చూడండి. ఇది ఇప్పుడు నీళ్లు లేక ఎండిపోయి కాలిగా ఉంది కానీ, వెయ్యి సంవత్సరాలకు ముందు, ఇదే ముఖ్య వనరుగా, పవిత్రమైన, శుద్ధమైన నీటిని అందించడానికి ఉండేది, ఇప్పుడు దీన్ని lock చేసేసారు, మనం లోపలికి కూడా వెళ్లలేము ఎందుకంటే, దీన్ని నాశనం చేయాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు అందుకే దీన్ని ఇప్పడు మూసేసారు. ఈ గుడి బయట చాలా అందమైన శివలింగాలు ఉన్నాయి, అవి ఒకొక్కటి వాటి గదిలో ఉన్నాయి. ఇది multifaceted లింగం అంటే ఈ లింగానికి చాలా faces ఉన్నాయి, దీన్ని ఎప్పుడు చూసిన మనల్ని మైమరచి పోయేలా చేస్తుంది. దీనికి ఎనిమిది భాగాలున్నాయి, గర్భగుడిలో అంటే గుడికి main chamberలో ఉన్న లింగానికి పదహారు భాగాలు ఉన్నాయి, ఈ లింగం వెనుక శివుడు, ఆయన భార్య, కుమారుడు ఉన్న శిల్పాన్ని కూడా మీరు చూడవచ్చు.
మహాబలిపురంలో కూడా సముద్ర తీరంలో ఉన్న గుడిలో, ఇదేలాంటి ఒక శిల్పం ఉంది, ఆ శిల్పంలో శివుడికి, వినాయకుడు ఇంకా అయ్యప్ప స్వామి ఈ ఇద్దరు కుమారులు ఉన్నారు, అయితే ఆ శిల్పంలో ఉన్న ఇద్దరు కుమారులకు మనిషి ముఖమే ఉంటుంది. మన అందరికి తెలుసు కదా వియకుడికి ఏనుగు ముఖం ఉంటుందని. కానీ ఇక్కడే ఒక interesting అయిన విషయం ఉంది, ఈ రెండు గుడుల గురించి ఇక్కడ ఉన్న ప్రజల్ని అడిగితే, ఈ శిల్పంలో ఉన్న పిల్లవాడు వినాయకుడు అని వాళ్లు చెప్తారు, ఎందుకంటే పాతకాలపు booksలో ఎం చెప్పారంటే వినాయకుడు పుట్టినప్పుడు normalగానే మనిషి ముఖంతో పుట్టారు, ఆ తరువాత కొన్ని రోజులకి ఆయన తలని కోల్పోయారు అందుకనే ఏనుగు తలని ఆయనికి పెట్టారని మనం చదివుంటాము.
ఇక్కడ ఉన్న ప్రజల నమ్మకం ప్రకారం చూసుకుంటే, ఈ గుడిని వినాయకుడు తలని కోల్పోక ముందు కట్టారు, అందుకే ఈ శిల్పంలో వినాయకుడుని మాములు తలతో చూపించారని చెప్తున్నారు. ఈ గుడి నుండి నూట యాభై మైళ్ళ దూరంలో ఇంకోక గుడి ఉంది, ఆ గుడి పేరు ఆది వినాయకుని గుడి అని అంటారు. అక్కడ కూడా వినాయకుడికి మనిషి ముఖమే ఉంటుంది, ఏనుగు ముఖం ఉండదు. ఈ గుడిని కూడా వినాయకుడు తలని కోల్పోక ముందే కట్టారు అని అంటున్నారు. Sorry guys, నేను వేరే కథలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు, ఇదేలాగా ఇక్కడ కూడా చాలా లింగాలు ఉన్నాయి, ఇక్కడ ఒక కాళీ గది ఉంది, ఒకప్పుడు ఇక్కడ లింగం ఉండేదేమో కానీ ఇప్పుడు లేదు.
కానీ, ఇక్కడ ఒక లింగం ఉంది, చూడటానికి artificial రాళ్లతో లేదా geopolymerతో చేసినట్టు ఉంది చూడండి. ఇక్కడ కొన్ని లింగాలు వరుసలో ఉన్నాయి, అవి అన్ని నేలమీద అంటే పీఠం మీద యోని లాంటి ఒక రకమైన glueని ఉపయోగించి అతికించి పెట్టారు, ఎందుకు ఇన్ని లింగాలు కైలాసనాథుని గుడికి బయట ఉన్నాయి? ఎందుకంటే, ప్రజలకి వివిధ రకాల లింగాలను ఎలా తయారుచేయాలో అని తెలుసుకోవడానికి వీటిని modelగా use చేసేవాళ్ళు. ఎల్లోరా గుహలలో ఉన్న కైలాస గుడిని కూడా, ఈ గుడి యొక్క modelని use చేసి కట్టి ఉండవచ్చు అని నేను మీకు already చెప్పాను గుర్తుందా! Okay, ఇప్పుడు మనం, ఈ గుడి లోపలికి వెళ్లి ఏముందో చూద్దాం రండి.
ఇక్కడ శివుని యొక్క అద్భుతమైన శిల్పాల వల్ల ఈ గుడి చాలా famous అయింది, ఇక్కడ మీరు చూస్తున్న చిన్న చిన్న detailsని ఇంకా లక్షణాలను ఇంకెక్కడా చూడలేరు.ఇక్కడ ప్రతీ శిల్పం మనకు ఒక కథని చెప్తుంది. ఇక్కడ చాలా పెద్ద శిల్పం ఉంది, ఈ మధ్యలో ఒక రహస్యమైన నవ్వుతో ఉన్నది శివుడు శిల్పం. మనుషులతో పోల్చి చుస్తే శివుడు చాలా పెద్ద ఆకారంలో ఉంటారు. ఈయన ఎంత చిన్న dressని వేసుకున్నారో చూడండి, కానీ shock అయిన విషయం ఏంటంటే శివుడు shoes వేసుకొని ఉన్నారు.
అదంతా కాదు కానీ, ఇది కొంచెం seriousగా గమనించండి, ఇది ఒక అద్భుతమైన విషయం, దీని వెనుక ఉన్న కథ ఏంటీ? ఆ కథ ఏంటంటే, కొంతమంది ఋషుల భార్యలు వాళ్లపై చూపే భక్తికి విశ్వాసాలకి చాలా గర్వంగా feel అయ్యి వాళ్లపై ప్రేమ పెరగడంతో, ఆధ్యాత్మికతలో ఉన్న ఆసక్తి వాళ్లకి తగ్గిపోయింది. వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పడానికి శివుడు బిచ్చగాడి వేషంలో, ఇల్లు లేనివాడిగా, వేసుకోవడానికి బట్టలు కూడా లేకుండా భూమి పైకి వస్తాడు, ఆయన జుట్టుని చూస్తే confirmగా shock అవుతారు, అలానే ఆయన జడముడి యొక్క detailsని చూడండి.