వరంగల్ గేట్స్ యొక్క ఆశ్చర్యపరిచే అద్భుతాలు! 5000 సంవత్సరాల క్రితం లేజర్ టెక్నాలజీ?
Hey guys, ఈ రోజు మనం తెలంగాణ లో ఉన్న "వరంగల్ గేట్స్" అని పిలవబడే ఈ ప్లేస్ గురించి చూడబోతున్నాము. ఈ పురాతన నిర్మాణాలన్నీ కేవలం entrancesలు లేదా gatesలు కాదని మన అందరికి బాగానే తెలుసు, so వీటిని ఎందుకు నిర్మించారో అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం రండి. చాలా మంది expertsలు ఈ నిర్మాణాలను సరిగ్గా పరిశీలించలేదు, కానీ ఈరోజు మనం వాటిని జాగ్రత్తగా చూడబోతున్నాము. ఈ గేటు పైభాగంలో, నేరుగా వేసిన ఒక కట్ ఉంది చూడండి, దాదాపు లేజర్ తో సరిగ్గా మధ్యలో కట్ చేసినట్టుగా ఉంది, ఇంకా దాని ద్వారా సూర్యుడు ప్రకాశిస్తున్నట్లు మీరు చూడవచ్చు.
మొదట్లో, ఇది శిల్పి పొరపాటు అని నేను అనుకున్నాను, కానీ ఈ కట్ ని ఇక్కడ ఉన్న 4 గేట్లపై ఉద్దేశపూర్వకంగా వేశారు, ఇంకా వాటిని తూర్పు, పడమర, ఉత్తరం మరియు దక్షిణ ద్వారాలలో మనం చూడవచ్చు. కానీ ఇవన్నీ ఒకేలా లేవు. ఈ గేట్ల పైన, ఒక ఓపెనింగ్స్ లాంటి అంటే కీ హోల్‌లను లాంటివి ఉన్నాయి చూడండి. ఈ cutల position ఒక్కొక్క గేట్లపై వేర్వేరు కీహోల్స్పై వేయబడి ఉంది. ఇప్పుడు మనం తూర్పు వైపు గేట్ నుండి ప్రారంభిద్దాం, ఇక్కడ ఈ కట్ ఎడమవైపు నుండి 4 వ రంధ్రంలో వేయబడి ఉందని మనం చూడవచ్చు. ఈ కట్ యొక్క Exact ఐన position, మూడున్నర కీహోల్స్ అంటే 3.5 లో ఉంది.
ఇప్పుడు, మనం దీనికి ఎదురుగా ఉన్న మరొక నిర్మాణంలోకి వెళితే, ఆ పడమర ద్వారానికి ఎడమవైపు నుండి 3వ రంధ్రంపై కట్ చేయబడి ఉంది, తూర్పు ద్వారంలో ఉన్న విధంగా 4వ రంధ్రంలో లేదు. So, పడమర ద్వారానికి ఉన్న ఈ కట్ యొక్క స్థానం 2.5. ఇప్పుడు, నేను ఈ సైట్ మధ్యలో నుండి ప్రతిదీ గమనిస్తున్నానని గుర్తుంచుకోండి మరియు మీరు తూర్పు మరియు పడమర ద్వారాలను పక్కపక్కన పెట్టి చూస్తే, అవి రెండు చూడడానికి ఒకేలా ఉండవు. ఈ కట్ ల యొక్క స్థానం వేరు వేరుగా ఉన్నాయి. అయితే, ఇప్పట్లో ఉన్న experts, ఇవి ఆదిమ శిల్పులు చేసిన సాధారణ పొరపాట్లు అని, ఇంకా అవి అస్సలు అర్థం లేనివని వాదిస్తారు.
కానీ ఈ experts చెప్తున్నది ఎందుకు తప్పవుతుందని నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు, మనం ఉత్తరం వైపు ఉన్న గేట్‌కి వెళ్దాం, straight గా వేసిన ఈ కట్ 4వ కీహోల్ దగ్గర ఉంది అంటే 3.5 దగ్గర ఉంది. ఇప్పుడు దీనికి ఎదురుగా ఉన్న దక్షిణం వైపు ఉన్న గేట్‌ను చూస్తే, ఈ కట్ 3వ కీహోల్ ఉంది అంటే 2.5లో ఉంది. ఇక్కడ మీరు ఇలాంటి patternను చూడవచ్చు, తూర్పు మరియు పడమర ద్వారాలలో 3.5 మరియు 2.5 కీ హోల్ లో, మళ్లీ ఉత్తరం మరియు దక్షిణ ద్వారాలలో 3.5 మరియు 2.5 అనే కీ హోల్ లో ఈ కట్ లు ఉన్నాయి. ఇలాంటి complex ఐన pattern యొక్క అర్థం ఏంటి? మన చరిత్ర పుస్తకాలలో ప్రాథమికంగా ఏదో తప్పు ఉందని ఇది రుజువు చేస్తుంది, అనేక శతాబ్దాలుగా ఆదిమ నాగరికత నుండి మనం మరింత అభివృద్ధి చెందిన నాగరికతగా పరిణామం చెందలేదు అని దీని నుండే అర్ధమౌతుంది.
దానికి బదులుగా, మనం ఇలాంటి పురాతన ప్రదేశాలను చూస్తున్నపుడు ఏం అనిపిస్తుందంటే, ఇప్పట్లో ఉన్న మనకు, ఆ కాలంలో వాళ్లు ఏమి చేస్తున్నారో అని అర్థం చేసుకోగల సామర్థ్యం మన తరానికి లేదని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనం ఈ గేట్లను మానవ దృష్టి కోణంలో నుండే చూస్తున్నాము మరియు మనము ఈ సైట్ ని మధ్యలో నుండి ఈ గేట్లను గమనిస్తున్నాము. ఇప్పుడు మీరు దీన్ని ఒక giant గా అంటే ఒక రాక్షసుడు అని అనుకోండి, అప్పుడు మీకు ఈ గేట్లన్నీ చిన్న చిన్న లెగో బ్లాక్‌లు లాగా అనిపిస్తే, మీరు ఈ సైట్ నుండి వెలుపల నిలబడి, వాటిని వేరొక వైపు నుండి చూస్తారు. మీరు ఈ సైట్ వెలుపలికి వెళ్లి తూర్పు ద్వారం వైపు నిలబడి చూస్తే, ఆ కట్ 3.5 దగ్గర లేకుండా 2.5 లో ఉందని మీరు తెలుసుకుంటారు.
ఇప్పుడు, మనం తూర్పు మరియు పడమర ద్వారాలు రెండింటినీ బయటి నుండి ఏదైనా ఒక ప్లేస్ లో నిలబడి చూస్తే, ఈ కట్స్ అన్ని నిజానికి ఒకేలా ఉన్నాయని తెలుస్తుంది. మళ్ళీ, మీరు ఉత్తరం వైపున వెలుపలికి వెళ్లి, ఉత్తర మరియు దక్షిణ రెండింటి ద్వారాలను చూస్తే, ఆ రెండు కట్ లు స్థానం ఒకే విధంగా ఉన్నాయని తెలుస్తుంది. ఈ కట్స్ అన్ని మూడవ లేదా 4వ కీహోల్ లో ఉన్న విధంగా ఈ మొత్తం గందరగోళం ఏర్పడుతుంది, ఎందుకంటే మనం ఈ పెద్ద సైట్ మధ్యలో నిలబడి మానవ దృష్టికోణం నుండి చూస్తున్నాము. ఈ గేట్లన్నీ సరిగ్గా 33 అడుగుల పొడవు ఉండేలా రూపొందించబడ్డాయి మరియు ఖచ్చితమైన cardinal directionsలలో కరెక్ట్ గా ఉంచబడ్డాయి.
ఇప్పుడు, నేను ఈ తూర్పు వైపు ఉన్న ద్వారం వెలుపలికి వెళ్లి, ఈ కట్ ద్వారా భూమికి సమాంతరంగా లేజర్ light ని ప్రకాశిస్తే, ఆ light సరిగ్గా పడమర వైపు ఉన్న ద్వారంలోని కట్ ద్వారా వెళుతుంది. నిశ్చయంగా, సంవత్సరంలో ఏది ఒక రోజు, సూర్యుడు ఉదయించినప్పుడు ఆ కిరణాలు తూర్పు వైపున ఉన్న ఈ కట్ ద్వారా వెళ్లి పడమర వైపు ఉన్న ద్వారంలోని కట్ నుండి బయటికి వస్తుంది. ఈ నిర్దిష్ట రోజు మరియు దాని ప్రాముఖ్యతను ఏంటని మనం తెలుసుకోవాలంటే ఖగోళ శాస్త్రవేత్తలు దగ్గర అడిగి తెలుసుకోవాలి.
తూర్పు ద్వారం మరియు పశ్చిమ ద్వారంపై ఉన్న ఈ కట్ ల మధ్య పొడవైన స్తంభాన్ని ఉంచి, ఇంకా ఉత్తర మరియు దక్షిణ ద్వారాల మధ్య మరొక స్తంభాన్ని ఉంచినట్లయితే, ఈ స్తంభాలు ఈ సైట్ మధ్యలో చాలా కచ్చితంగా కలుస్తాయి మరియు అది ఈ సైట్ ని 4 సమానభాగాలుగా చేస్తుంది. ఇంకా అది మాత్రమే కాదు, ఈ స్తంభాల యొక్క నీడలు నేలపై పాడేటప్పుడు, దానితో మనం సమయాన్ని చాలా ఖచ్చితత్వంతో అంటే ఒక సెకన్ల సమయాన్ని కూడా తెలియజేస్తుంది, దీన్ని వివిధ లక్షణాలతో ఉండే ఒక క్యాలెండర్‌గా కూడా ఉపయోగించవచ్చు.
- Praveen Mohan Telugu














