4 ఫిబ్రవరి 2021 ,23 :13 .
4 ఫిబ్రవరి 2021 గురువారం,నిత్యానంద సత్సంగ్.
10 :07 PM తెర ఓపెన్ అవుతుంది.
* జగత్గురు మహాసన్నిదానం,దైవస్వరూపులు నిత్యానంద పరమశివం శక్తి పాద, శక్తిని పాద తో ప్రత్యక్ష దర్శనం.
10 :11 PM నుంచి 11 : 15 PM వరకు నిత్యానంద సత్సంగ్.
* కైలాస నుంచి పరమశివుని సందేశం డైరెక్ట్ గా .
* నా సామాన్యమైన ప్రేమ వలన, నా సొంత లైఫ్ మీ అందరి లైఫ్ లాగా మానిఫెస్ట్ అవుతున్నది.
* మీ దగ్గరవున్న చాలా విలువైనది, మీ చేతనస్థితి జీవితం.( consciousness -life )
* మీ ఇచ్ఛా శక్తి ద్వారా దానిని మీకు కావలసినట్లు మలచుకొని ,మానిఫెస్ట్ చేసుకోవచ్చు.
* దానిని అనుభవించడానికి మీకు క్రియాశక్తి అవసరం వున్నది,మానిఫెస్ట్ చేయడానికి కాదు.
* కేవలం మీ పరిపూర్ణమైన ఇచ్ఛాశక్తి ద్వారా మీకు కావలసిన దాన్ని మానిఫెస్ట్ చేసుకోవచ్చు.దానిని అనుభవించడానికి మాత్రమే క్రియాశక్తి అవసరం ఉంటుంది.
* ఇంకా స్పష్టంగా,సూటిగా వివరిస్తాను:
* ప్రపంచాన్ని అనిభావించడానికి మీకు ఆరోగ్యమైన శరీరం మీరు కోరుకుంటారు.దానిని కేవలం ఇచ్ఛాశక్తి ద్వారా సాధించవచ్చు.
* క్రియా శక్తిని మానిఫెస్ట్ చేయడానికి/ప్రేరేపించడానికి ఇచ్ఛాశక్తికి సామర్ధ్యం ఉంటుంది.
* మీమీద నాకున్న మధురమైన, సామాన్యమైన ప్రేమ కారణంగా నేను ఈ లోతైన రహస్యాలను బహిర్గతం చేస్తున్నాను.మీమీద నాకున్న ప్రేమకి నేను సంపూర్ణం గా ఏకీకృతమై వున్నాను.
* మీమీద నాకున్న ప్రేమ కారణంగా నేను ఇక్కడ కు వచ్చి కూర్చుంటున్నాను. దీనివలన నాకువచ్చేది ఏమి లేదు.
* నేను జస్ట్ ఇప్పుడే సమాధి నుంచి లేచి వచ్చాను.నేను చాలా చక్కటి తీ తీసుకుంటున్నాను, పాలు లేకుండా,అల్లం,లవంగాలు,అన్ని మూలికలతో.నేను లవంగాలను మెత్తగా చేసిన పేస్ట్ తో పళ్ళు తోముకుంటున్నాను.
* నా జీవితం చాలా ప్రశాంతంగా,సంతోషంగా,సాధారణంగా,ఆనందంగా వున్నది.
* నేను ఇప్పుడే స్నానం చేసి పూజ చేసి వచ్చినట్లు నా విభూది గుర్తులను మీరు గమనించగలరు.నేను స్నానం చేతున్నప్పుడే నా ఆత్మపూజ చేసేస్తాను.
* నేను సమాధిలో సంపూర్ణ ప్రశాంతంగా వుంటాను.నాకు మీ అందరిమీద వున్నప్రేమ కారణంగానే నేను వచ్చి మీ అందరితో మాట్లాడుతున్నాను.
*పెద్ద సమస్య ఏమిటంటే, ఆరోగ్యం కానీ,సంపద,జీవన్ముక్తి,లేదా శక్తులను సాధించడానికి చాలా క్రియాశక్తి అవసరం ఉంటుందని ప్రజలందరూ అనుకుంటూ వుంటారు. అది భ్రమ.
* మీకు సంపూర్ణమైన ఇచ్చాశక్తి అవసరం వున్నది-కోరిక- అంతే.
* కోరికకు క్రియని మానిఫెస్ట్ చేసే సామర్ధ్యం ఉంటుంది.( THE ACTION POWER )
1 . ఇచ్ఛాశక్తి - కోరికకు,సంకల్పానికి మీ శక్తి.
2 . క్రియాశక్తి- ఎక్కువ పనిచేసి మరియు మానిఫెస్ట్ చేయడానికి కావలసిన శక్తి.
3 . జ్ఞానశక్తి- జీవన్ముక్తి ,పరిజ్ఞానం యొక్క శక్తి.
* ఆరోగ్యం కోసం మీరు ఇలా అనుకుంటారు,ఓ ! నేను లేచి యోగా చేయాలి,శరీరాన్ని వంచాలి.అప్పుడు మాత్రమే నాకు ఆరోగ్యం ఉంటుంది అని. నాకు సంపద కావాలంటే నేను ఆఫీస్ కి వెళ్లి పగలు రాత్రి కుక్కలాగా పనిచేయాలి ,అప్పుడే సంపద వస్తుంది.
* అన్నింటికన్నా ముందు అర్ధం చేసుకోండి : కుక్కలా పనులు కాదు !
* యదార్దానికి అది ఒక భ్రమ.
* మీ ఇచ్ఛాశక్తి మీకు 99 .999 % విజయాన్ని ఇస్తుంది.
* మీ క్రియా శక్తి . దాని అవసరం కొంచమే ఉంటుంది.
* మీరు భయబ్రాంతులకు గురైనప్పుడు మీ చుట్టూ మీరు భయపడే ప్రతికూలతనే చూస్తారు.మీరు మీ గురువు మీద మీ మీద సహా అన్నింటిమీద నమ్మకాన్ని పోగొట్టుకుంటారు.
* మీరు ప్రేమలో పడినప్పుడు,తెలివితక్కువ మోసంచేసి ప్రేమికురాలు / ప్రేమికుడు దైవంలాగా కనిపిస్తారు.
* కాబట్టి మీ అభిప్రాయాలు భ్రాంతి.
* మీ అభిప్రాయాల ఆధారంగా మీ చేతనస్థితిని,మీ జీవితాన్ని నిర్మించుకోవద్దు. నిజమైన జ్ఞానం/ పరిజ్ఞానం / జీవితం గురించి సరైన అవగాహన ఆధారంగా నిర్మించుకోండి.
* మీ ఆరోగ్యాన్ని ఉదాహరణగా తీసుకోండి.చాల ముఖ్యమైన విషయం.మీ జీవితంలో ప్రతి అంశంలో ఈ సూత్రాన్ని అమలు చేయండి.
* మంచి ఆరోగ్యం కావాలంటే యోగా చేయాలి, వ్యాయామం,ఆహారానియమావళి చేయాలనీ మీరు ఎప్పుడు అనుకుంటూ వుంటారు.మీ ఆరోగ్యానికి చాలా విషయాల ప్రమేయం వుంటుందని అనుకుని,మీరు చేయాలనుకున్నవన్నిటిని ఆలోచించినప్పుడు మీరు అలసిపోయి మీ ఆరోగ్యం గురించిన ఆలోచనలను వదిలేస్తారు.
* యదార్దానికి, మీరు ఆరోగ్యాంగా ఉండటానికి కావలసినది ఒకేఒక్కటి,మీరు ఆరోగ్యాంగా ఉండాలనే మీ సంకల్ప శక్తి,కోరిక . కేవలం దానినే పెంచుతూ వెళ్ళండి.
* మీకు ఇప్పటికే ఆరోగ్యకరమైన శరీరం ఉందని ఊహించుకోండి.ఆలోచించండి: ఆహా నేను ఆరోగ్యాంగా ఎలా ఫీల్ అవుతున్నానో,అందంగా,మెరుస్తూ,ప్రకాశవంతంగా,సంతోషంగా,యవ్వనంగా,శక్తివంతమైన శరీరంతో.
* ఇచ్ఛాశక్తి రూపంలో మీ చేతనస్థితి మీ జీవితంలో ప్రేరేపించబడినప్పుడు 99 .999 % పని జరిగిపోతుంది.
* ఆరోగ్యకరమైన శరీరం ద్వారా మీరు పొందాలనుకున్నవి మీ చర్యలు కేవలం ఎంజాయ్ చేయడానికి సరిపోతాయి.
* నేను క్రియాశక్తిని అగౌరవపరచడం లేదు. క్రియాశక్తి మీద వున్న మీ భ్రమ మిమ్మలను అలసటలోను,విసుగులోను,నిరాశ,జీవిత ప్రతికూలతలో పడేస్తుంది.అదే పొరపాటు.
* నా సొంత శిష్యులు చాలామందికి: మీ భయ భ్రాంతులు మిమ్మలను జీవిత ప్రతికూలత,నిరాశలలో పడేస్తాయి.మరియు దానివలన మీరు మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుని మీ జీవితాన్ని పోగొట్టుకుంటారు.
* ఆరోగ్యం మీద కోరికను మీలో నింపుకొండి- ఇచ్ఛా శక్తి . ఇచ్ఛాశక్తి చాల శక్తివంతమైనది.మీకు తెలియకుండానే మిమ్మలను యోగ,జిమ్,డైట్ అన్నింటిలోనూ పడేస్తుంది.
* నేను ఇది చెయ్యాలి ,అది చెయ్యాలి అని మీరు అదేపనిగా ఆలోచిస్తూ,ఒకరోజు జిమ్ కి వెళ్లి పది వ్యాయామాలు చేసి,మీ కండరాలు పెరిగాయని చెక్ చేసుకుంటారు.
* మీరు ఆరోగ్యాంగా ఉండాలి అనే అచ్ఛాశక్తిని ప్రేరేపించుకుంటే,మీ జీవిత మొత్తం సమలేఖనం ( ALIGN ) అవుతుంది,విశ్వం చక్కగా అదే సమలేఖనం చేస్తుంది.
* మీరు మంచి మనుషులుగా మారతారని నేను ఇవన్నీ చెప్పడం లేదు,మీరు ఇవన్నీ వింటే మీరు మంచి వ్యక్తులుగా మారతారు,కానీ అది వేరేవిషయం .మిమ్మలను జీవన్ముక్తులుగా ( CONSCIOUS HUMAN BEING / ENLIGHTENED BEING ) చేయడం నా ఆసక్తి.
* మీరు ఆరోగ్యకరమైన శరీరాన్ని మానిఫెస్ట్ చేసిన తరువాత,మీరు ఎంజాయ్ చేయాలనుకున్నది ఏదైనా,రుచికరమైన భోజనం కావచ్చు, లేదా మంచి సంగీతం,లేదా అందంగా చూసేవి,లేదా స్పర్శలోని రుచి మీరు ఎంజాయ్ చేయాలనుకున్నది ఏదైనా దానికి క్రియాశక్తి అవసరం మాత్రమే మీకు ఉంటుంది.
* దురదృష్టవశాత్తు మీకు చాలా భ్రమ వుంటుంది.సమాజం యొక్క సగటు ఆలోచనలతో మీరు చాలా బ్రెయిన్ వాష్ చేయబడ్డారు.
* సగటు ఆలోచనలు మిమ్మలను నా నుంచి దూరంగా పెడుతున్నాయి.
* అవి మిమ్మలను జీవితం కష్టం అనుకునేలాగా చేస్తున్నాయి.
* నేను ఆత్మ విశ్వాసాన్ని భోదించేవాడిని కాదు.యదార్దాలను బహిర్గతం చేసేవాడిని.
* ఈ సత్యాలనుంచి మీరు ఆత్మవిశ్వాసం సంపాదించుకోవచ్చు.కానీ నేను సత్యాలను బహిర్గతం చేస్తాను.సత్యాలు,సత్యాలు,సత్యాలను మాత్రమే,ఎందుకంటె నేను మిమ్మలనుచాలా ప్రేమిస్తున్నాను కాబట్టి,సింపుల్ లాజిక్ .
* మీలో ప్రతిఒక్కరు ఒక వాస్తవమైన చేతనస్థితి ప్రేరేపించబడిన జీవితంలాగానేను చూస్తాను,లేదా మిమ్మలను పూర్తి జీవిత శక్తిలో చేతనస్థితి ప్రేరేపించబడినట్లు చూస్తాను.( I SEE EACH ONE OF YOU AS A LIFE IN WHOM REAL CONSCIOUSNESS CAN BE INFUSED OR I SEE YOU AS A CONSCIOUSNESS IN WHOM LIFE ENERGY CAN BE INFUSED )
* తెల్లవారుజామున మీరు ఫీల్ అయ్యే తాజాతనాన్ని జాగ్రతా స్థితి అంటారు.
* తురీయా స్థితిలో జాగ్రతా స్థితికన్నా 1000 రేట్ల ఎక్కువ తాజాతానం ఉంటుంది.
* తురీయాతీత స్థితిలో తురీయా స్థితికన్నా ట్రిలియన్ రేట్ల ఎక్కువ తాజాతానం ,జీవం ఉంటుంది.
* తురీయాతీత స్థితిని జాగ్రతఁ స్థితిలోకి పుట్టించడం చాల తేలిక. అది మీకు విభూది ఇచ్చి మీ నుదిటిమీద తాకి దీవించడం అంత తేలిక.
* ఈ సత్యాలను వినండి. మీ భ్రమనుంచి బయటకు రండి.
* మీ అలసట,విసుగు,నిస్పృహ గురించిన భయాలు జీవితం యొక్క యధాతథస్థితి.
* మీరు యధాస్థితిలో ఎందుకు జీవించడం ? ఎందుకంటె ఏమిచేయలేము అని మీరు అనుకుంటారు.నేను ఇప్పటికే కొట్టబడ్డాను,ఇప్పటికే విరచివేయబడ్డాను అని మీరు అనుకుంటారు.మీరు ఏదో మోసపూరితమైన గందరగోళంలో వున్నారు.
* ఒక్క సత్యాన్ని మీలోకి పంపిస్తే , మీరు చాలా భ్రమలనుంచి బయట పడతారు.
* మీరు కోరుకున్నది మానిఫెస్ట్ చేయడానికి ఇచ్చా శక్తి, మీరు చూడకలిగే సామర్ధ్యం,చాలా విలువైనది, చక్కనిది,శక్తివంతమైనది,ముఖ్యమైనది, కావలసిన పదార్ధం,మూల పదార్ధం.
* మీరు మండుతున్న తీవ్రమైన కోరికను సృష్టిస్తే,అది మిమ్మలను పడక మీదనుంచి లేపి జిమ్ కి, యోగా కి, డైట్ కి తోసే సామర్ధ్యం ఉంటుంది.
* మీరు 10 వ రోజు విఫలమయినా ,మీరు 11 వ రోజు చేస్తారు.
* మీరు చనిపోయినాకూడా,తరువాత వేరే శరీరం తీసుకుని దాన్ని మానిఫెస్ట్ చేస్తారు. మీ కోరిక శక్తి కి దానిని మానిఫెస్ట్ చేసే సామర్ధ్యం ఉంటుంది.
* మిమ్మలను చేతనస్థితి జీవులుగా ( CONSCIOUS BEINGS ) చేయడానికి నేను నిజంగా,మనస్ఫూర్తిగా, ఆశక్తి చూపిస్తున్నాను.
* మీరు ఎక్కడైతే దొరికిపోయారో ఆ పాయింట్ దగ్గర అందుకే నేను కొడుతూ వుంటాను.
* సోమరితనాన్ని నేను వివరిస్తాను:
భ్రమలో బ్రతకడం,జీవితయొక్క సౌలభ్యం తెలుసుకోకపోవడం అదే సోమరితనం.
* నాగరిక మానవులలో రెండు స్థితులు మాత్రమే వున్నాయి.
1 ) జీవిత సౌలభ్యం తెలుసుకుని మీకు కావలసినవి మానిఫెస్ట్ చేస్తూ జీవించడం.
2 ) సోమరితనంతో విసిగిపోయివుండటం.
* కావలసిన కోరికలు లేకపోవడం,,సోమరితనానికి మూలం.ఇచ్ఛాశక్తి.
* పనిచేయడానికి సరిపడా శక్తి లేదని మీరు అదేపనిగా చెపుతూ వుంటారు,మరియు మీకు సరిపడా శక్తి లేదు- క్రియా శక్తి-పనిచేయడానికి.
* మీకు క్రియాశక్తి అవసరం లేదు.ఎంజాయ్ చేయడానికి,సెలెబ్రేట్ చేయడానికే దాని అవసరం, మానిఫెస్ట్ చేయడానికి కాదు.
* మీరు సామాన్య ఆలోచనలను నమ్మడం మొదలుపెట్టి,మీరు కోరుకున్న వాటిని మానిఫెస్ట్ చేయడానికి పని చేస్తే,మీరు ఇచ్ఛాశక్తిని చంపడానికి సామాన్య ఆలోచనలను ఉపయోగిస్తారు.మరియు సామాన్యునిగా చనిపోతారు.
* ఈ సత్యం మీద ధ్యానం చేయండి.
* మీరు ఆరోగ్యాన్ని.సంపదను,మానసిక సంతోషాన్ని, ఫలసిద్ధి,పరమశివ యొక్క స్థితి, స్పేస్ మరియు శక్తులను మానిఫెస్ట్ చేయడానికి తీవ్ర కోరిక- ద్రుష్టి- ఇచ్ఛాశక్తి - మీరు కోరుకున్నవి తీర్చుకోవడానికి సరిపోతుంది.మీకు కావలసినవి అన్నీ ప్రేరేపించుకోవడానికి,వాటిని ఆకర్షించడానికి,మీ జీవితంలో అన్నింటిని సరిగా సమకూర్చి,మరియు యదార్థంగా మానిఫెస్ట్ చేయగలరు.
* పరమశివ ని మానిఫెస్ట్ చేయడానికి నాకు ఉన్నదల్లా తీవ్ర కోరిక.విశ్వం మొత్తం మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది.
* కుప్పమ్మాళ్, నా గురువు, మాట విభూదానంద పూరి,నా జీవితంలోకి చక్కగా, మధురంగా వచ్చారు.నేను పరమశివుని మానిఫెస్ట్ చేయడానికి కావలసినవన్నీ ఆమె నా జీవితంలోకి తీసుకొచ్చారు.ఉత్తర భారతదేశంలో హంసానంద పూరి కావచ్చు,లేదా తిరువణ్ణామలై లోని రఘుపతో యోగి ,లేదా నారాయణ స్వామి తాత, నాకు మూలికలు,ఔషదాల శాస్త్రాలను నేర్పించడానికి.
ఆమె పెద్ద వయసులోనూ పర్వత మలై వరకు వెళ్లేవారు.పర్వత మలై పర్వత గిరి దగ్గర వూరు.
లక్ష్మణుణ్ణి కాపాడటానికి హనుమంతుడు సంజీవ పర్వతాన్ని హిమాలయాలనుంచి లంకకు తీసుకువెళ్లే క్రమంలోదానిలోని ఒక భాగం అక్కడ పడిందని చెపుతారు.అదే పర్వత మలై.అది సత్యం అని నాకు తెలుసు. ఎందుకంటె పర్వత మలై అంత ఔషధ మొక్కలు ఉంటాయి. నా శరీరానికి అల్కమీ ప్రక్రియకు కావలసిన మూలికలను ఆమె ఆ పర్వతం నుంచి సేకరించి తెచ్చేవారు.
హిందూ సంప్రదాయంలో మణి, మంత్రం, ఔషధం , వీటి ద్వారా పరమశివుని శక్తులను మానిఫెస్ట్ చేయవచ్చు.శక్తులు మీలో మానిఫెస్ట్ అవుతాయి. ఆమె ఆ మూడు నా మీద ఉపయోగించేవారు.పరమశివ ని మానిఫెస్ట్ చేయడానికి ఆమె నాకు సపోర్ట్ చేసేవారు.
* నేను చేసింది ఒక్కటే,తీవ్రమైన కోరిక- ఇచ్ఛాశక్తి కోరిక-చాలా బలంగా. ప్రతిఒక్కటి నా చుట్టూ చేరిపోయాయి.
* మీరందరు మీ ఇచ్ఛాశక్తిని తీవ్రంగా ప్రేరేపించుకోండి.మీకు కావలసింది అదే.ప్రతిఒక్కటి మీవైపు ఆకర్శింపబడి, సరిగా సమీకరింపబడి మీ వాస్తవికత మానిఫెస్ట్ అవ్వడం మీరు గమనిస్తారు.