కేటీఆర్ టీమ్ లో మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు తనయుడుకు చోటు?
రాబోయే ఎన్నికల్లో మంత్రి కేటిఆర్ ను ముఖ్యమంత్రి చేయడానికి సీఎం కేసీఆర్ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
సీనియర్లు కేసీఆర్ వెంట..జూనియర్ లు కేటీఆర్ వెనకాల!
కేటీఆర్ వెంట వివిధ నియోజకవర్గ పరిధిలో యువకులను బరిలో దింపుతున్నారు కేసీఆర్. 2023 లేదా 2024 లో వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు సీనియర్ నేతలు తప్ప అందురూ యువ నాయకులే ఉండాలని కేటీఆర్ కు సీఎం సలహా ఇచ్చినట్టు పార్టీ వర్గాల భోగట్టా.
ఇక యువకులదే రాజ్యం..!
అంతకుముందు జరిగిన నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లోనూ, ఇప్పుడు జరగబోయే హుజురాబాద్ ఉపఎన్నికలోనూ కేసీఆర్ స్వయంగా కేర్ తీసుకొని యువ నాయకత్వానికి వరుసగా అవకాశాలు ఇస్తూ పోతున్నదాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
వారికి తొలిసారి ఎమ్మెల్యేగా అవకాశం!
ఇప్పుడు తాజాగా గద్వాల్ నియోజకవర్గ పరిధిలో కూడా వచ్చే ఎన్నికల్లో అదే సేన్ రిపీట్ అవుతుందా? అన్న సందేహం కలుగుతోంది. గతంలో చదువురాని అత్యంత వెనకబడిన వర్గంలోని గట్టు భీముడు.. ఉన్నత వర్గానికి చెందిన భరత సింహారెడ్డి భార్య డీకే అరుణ పై 1999లో టీడీపీ నుంచి గెలిచి గద్వాలపై మంచి పట్టు సాధించి.. బోయ వర్గం నుంచి తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేగా రికార్డ్ బద్దలు కొట్టాడు.
గట్టు భీముడి జీవిత చరిత్ర కొద్దిగా..
గట్టు భీముడు తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. 1999లో తెలుగుదేశం పార్టీ నుండి గద్వాల్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశాడు.
బోయ కుటుంబానికి చెందిన భీముడు జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండలంలోని బల్గెర గ్రామంలో జన్మించాడు.
చాలాకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేసిన భీముడు 1999 ఎన్నికలలో పార్టీ తరపున పోటిచేసి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి. కె. అరుణపై గెలుపొందాడు. 2004లో సమాజ్వాది పార్టీ నుండి పోటీచేసిన డి.కె.అరుణ చేతిలో ఓడిపోయాడు. ఆనాటి నుండి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న భీముడు 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలు సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలుపుకు కృషి చేశాడు.
గత కొంతకాలంగా మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న భీముడు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, జూన్ 12 బుధవారం ఉదయం మరణించాడు.
ఆయన సతీమణి భువనేశ్వరి ఇవాళ తన కుమారులు వెంకటరమణ, సాయి, కూతుళ్ళతో మంత్రి కేటీఆర్ ను హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో కలిశారు.
రాబోయే పదవి కోసం...!
మొన్న గద్వాలకు మంత్రి కేటీఆర్ వచ్చినప్పుడు బోయలకు ఎస్టీ హోదా ఏమైందని తన కాన్వాయ్ కి అడ్డు తగిలి ఆ వర్గం తాలూకు ఆవేశాన్ని అర్థం చేసుకొని..ఎలాగైనా బోయలను శాంతిపరచాలంటే వారికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వచ్చే జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వాలని భావించినట్టు తెలుస్తోంది. అందుకే గట్టు భీముడి సతీమణి భువనేశ్వరిని కేటీఆర్ పిలుపించుకొని వారి కుమారుడు లేదా కూతురికి సీటు ఇస్తామని హామీ ఇచ్చారని గద్వాల గట్టు భీముడి వర్గం వారు ఒకరికొకరు చెవులు కొరుక్కొంటున్నారు.













