నేను 'కమిట్మెంట్' కు రెడీ...
నేడు బిగ్‌బాస్ ఫేమ్, హీరోయిన్ తేజస్వి మదివాడ పుట్టిన రోజు. 1991 సంవత్సరంలో జన్మించిన ఈ బ్యూటీ నేటితో 29వ ఏటలో కి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా తేజస్వికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె లేటెస్ట్ మూవీ 'కమిట్మెంట్' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. కొద్ది రోజుల క్రితం ‘కమిట్మెంట్’ వెబ్ అంథాలజీ సిరీస్‌లోని నలుగురు ప్రధాన పాత్రధారులను ఇంట్రడ్యూస్ చేస్తూ విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. నలుగురి కథగా రూపొందుతోన్న ఈ ఎరోటిక్ ఎంటర్టైనర్లో తేజస్వి మదివాడ, రమ్య పసుపులేటి, సిమర్ సింగ్, అన్వేషి జైన్ మెయిన్ రోల్స్ పోషిస్తున్నారు. “లవ్.. డ్రీమ్.. హోప్.. ఫైట్” అనేది ట్యాగ్‌లైన్.ఈ సినిమాలో ముఖ్యంగా సినీ పరిశ్రమలో హీరోయిన్స్ పడే ఇబ్బందులు, వారు ఎదుర్కోనే వేధింపులు, ఎలా మోసగిస్తారో.. ఇలా పలు అంశాలను చర్చించనున్నారు. Read the full article

















