మైఖేల్ స్టర్టైన్ ఆధ్వర్యంలోని ఆదేశ ఉన్నతస్థాయి అధికారులు ప్రోఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్రవ్యవసాయ విశ్వవిద్యాలయంను సందర్శించారు. జర్మనీ ఆహార, వ్యవసాయ శాఖ పార్లమెంట్ స్టేట్ సెక్రటరీ (సహాయ మంత్రి) మైఖేల్ స్టర్టైన్ ఆధ్వర్యంలోని ఆదేశ ఉన్నతస్థాయి అధికారుల ప్రతినిధుల బృందం మంగళవారం ప్రోఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్రవ్యవసాయ విశ్వవిద్యాలయంను సందర్శించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపకులపతి డా. విప్రవీణ్ రావుతో పాటు రిజిష్ట్రార్ డా. ఎస్ సుధీర్ కుమార్ తో పాటు విశ్వవిద్యాయ ఉన్నతాధికారులతో ముఖాముఖి సమావేమై పలు అంశాలపై చర్చించారు. బోధన, పరిశోధన, విస్తరణ లో వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపడుతోన్న కార్యక్రమాలను ఉపకులపతి డా. ప్రవీణ్ రావు వారికి వివరించారు. గడిచిన 5ఏళ్ళలో రాష్ట్రవ్యవసాయ రంగంలో ఎదురైన అనేక సవాళ్ళను సమర్థవంతంగా పరిష్కరించి వరితో పాటు అనేక పంటలలో ఉత్పాధకతను, ఉత్పత్తిని ఘననీయంగా పెంచగలిగామన్నారు. అలాగే నీటి ఆదా పద్దతులను అభివృద్ధి పరచి వరిపంటలో మంచి ఫలితాలను సాధించగలిగామన్నారు. వివిధ పంటలలో నీటి యాజమాన్యపద్దతులపై పరిశోధనలు చేస్తున్నామని వివరించారు. సమీకృత వ్యవసాయ సాగుపద్దతులతో ఉత్పాధకతను పెంపోందించగలిగామని వివరించారు. ప్రజల ఆహారపు అలవాట్లను దృష్టిలో ఉంచుకొని పరిశోధనా కార్యక్రమాలను రీఓరియంట్ చేసుకొంటున్నామని తెలిపారు. పరిమిత వనరులతో ఎక్కువ దిగుబడులను సాదించే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. వనరుల సమర్థవినియోగానికి అవసరమైన కార్యక్రమాలను రూపొందించుకొని అమలు జరుపుతున్నామని వివరించారు. ఇండో-జర్మన్ ప్రాజెక్టు అమలు వల్ల తమ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరిందని తెలిపారు. ఈ సందర్భంగా జర్మనీ ఆహార, వ్యవసాయ శాఖ పార్లమెంట్ స్టేట్ సెక్రటరీ (సహాయ మంత్రి) మైఖేల్స్టర్టైన్ మాట్లాడుతూ ఇండో - జర్మన్ విత్తన ప్రాజెక్టులో జరుగుతోన్న కార్యక్రమాలను అభినందించారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న పథకాలు తమను ఎంతగానో ఆకట్టుకొన్నాయన్నారు. తాను భారతదేశ పర్యటనకు రావలని నిర్ణయించుకొన్న తర్వాత తెలంగాణను సందర్శించవలసిందిగా తమ రాయబార కార్యాలయం సూచించిందని వ్యవసాయ రంగంలో సమాఖ్య స్పూర్తితో ఇక్కడ అమలవుతోన్న కార్యక్రమాలు బాగున్నాయని ఆయన ప్రశంసించారు. బోధన, పరిశోధన, విస్తరణ రంగాలలో వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపడుతోన్న కార్యక్రమాలను జర్మనీ ప్రతినిధుల బృందం అభినందించింది.అంతకుముందు ఆడిటోరియం ప్రాంగణంలో విశ్వవిద్యాలయం చేపట్టిన పరిశోధనలు, విస్తరణ, బోధనా కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను జర్మనీ పార్లమెంట్ స్టేట్ సెక్రటరీ తో పాటు, ప్రతినిధిబృందం ఆసక్తిగా పరిశీలించింది. ఈ సమావేశంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు డా. జగదీశ్వర్, డా. రాజి రెడ్డి, డా.సత్యనారాయణ, డా. మీనాకుమారి, డా. విష్ణువర్ధన్ రెడ్డి, డా. సదాశివరావు, డా. వీరాంజనేయులు, కంప్టోలర్ రమేశ్ తో పాటు పలువురు శాస్త్రవేత్తలు పాల్గోన్నారు. Tags: mikhel,professor, jayashanker
Loading...










