@ranadaggubati @prabhas @ssrajamouli @anushkashetty @tamannaahspeaks #koradanews #korada #baahubali2 #bossisback #chiru150 ఖైదీ మెగా కౌగిలిలో బాహుబలి ప్రభాస్..! బాహుబలి షూటింగ్ లో గత కొంతకాలంగా ఊపిరి సలపకుండా పనిచేస్తున్నారు జక్కన్న, ప్రభాస్ అండ్ కో. మరో వైపు ఇన్నాళ్ల పాటు సినీ రంగానికి దూరంగా ఉన్న మెగాస్టార్, మళ్లీ ఫీల్డ్ లోకి దిగి ఖాళీ లేకుండా వర్క్ చేసేస్తున్నారు. ఈ ఇద్దరు స్టార్స్ కలయికకు ఖైదీ నెంబర్ 150 సెట్ వేదికగా నిలిచింది. షూటింగ్ పూర్తవ్వడంతో రాజమౌళి, ప్రభాస్ ఫ్రీ అయ్యారు. దాంతో తమ సెట్ నుంచి దగ్గర్లోనే షూటింగ్ జరుపుకుంటున్న ఖైదీ సెట్స్ కు వెళ్లి మెగా టీమ్ ను పలకరించారు. ప్రభాస్ ను చూడగానే అప్యాయంగా కౌగలించుకున్నారు చిరంజీవి. ప్రభాస్ కూడా చిరు దరహాసంతో ఆనందంగా మెగాస్టార్ తో ముచ్చటించాడు. చిరు రీఎంట్రీ ఒకప్పటి మెగా సినిమాల్లా రికార్డులు బద్ధలుగొట్టాలంటూ ప్రభాస్ విష్ చేస్తే, బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి పేరును మరింత విఖ్యాతం చేయాలని చిరంజీవి అభిలషించారు. ముందు జనరేషన్ ను తర్వాతి జనరేషన్ స్ఫూర్తి గా తీసుకోవడం, వారికి గౌరవాన్ని ఇవ్వడం టాలీవుడ్ లో ఎప్పటి నుంచో వస్తున్నదే..దాన్ని మరోసారి ఈ కలయిక గుర్తు చేసింది.