ఆంధ్ర ఎలక్షన్ కు చంద్రబాబు రాహుల్ తో పొత్తు పెట్టుకుంటారా | Chandrababu Naidu| Peoplesposttv|
#ChandrababuNaidu #APCM #ChandrababuSpeech #ChandrababuTDP #TeluguDesamParty #TDPLeaders #PoliticalUpdates #Peoplesposttv #AndhraPolitics #AndhrapradeshElections #Rahulgandhi #CongressLeaders #ChandrababuRahulgandhi
అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన తెలంగాణ ఎన్నికల పోరు ముగియడంతో రణక్షేత్రం కొంత చల్లబడింది. కాదు… మూడు నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల వార్ కోసం వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది అంటున్నారు విశ్లేషకులు. వంద రోజుల అనంతరం జరగబోయే వార్ కోసం అటు దేశంలోనూ,ఇటు ఇరు రాష్ట్రాల్లోనూ వేగంగా కదులుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాతావరం కాకా మీద ఉంది. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అమలు చెయ్యవలసిన వ్యూహాల గురుంచి కసరత్తులు జరుపుతుంది. ఆంధ్ర ఎలక్షన్ కు చంద్రబాబు రాహుల్ తో పొత్తు పెట్టుకుంటారా | Chandrababu Naidu| Peoplesposttv| తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీడీపీతో కలిసివెళ్లి కాంగ్రెస్ చెయ్యి కాల్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో పొత్తు కంటిన్యూ చెయ్యాలా?వద్దా? అని సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై చర్చించడానికే పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డిని అధిష్టానం ఢిల్లీకి రమ్మని కబురుపంపింది. ఆంధ్ర ఎలక్షన్ కు చంద్రబాబు రాహుల్ తో పొత్తు పెట్టుకుంటారా | Chandrababu Naidu| Peoplesposttv| కాగా,బీజేపీతో చెడినప్పటినుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాహుల్ తో అధికారికంగా చేతులు కలిపి,దేశమంతా చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ మీడియా ముందు దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. అదీగాక,ఎన్డియేను గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీయేతర కూటమిని బలపరిచే ఉద్దేశంతో … ఆయా రాష్ట్రాల హేమాహేమీ నేతలతో “సేవ్ డెమోక్రసీ …. సేవ్ నేషన్” పేరుతో సమావేశాలు కూడా జరిపారు. అంతేనా… పడితే పట్టిన పట్టు వదలని బాబు … సొంత రాష్ట్రంలో పెథాయ్ తూపాన్ బీభత్సం సృష్టిస్తున్న ఆ పనుల్ని కొడుక్కి అప్పజెప్పి… రాజస్థాన్,మధ్యప్రదేశ్,ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి కూడా హాజరయ్యారు. ఆంధ్ర ఎలక్షన్ కు చంద్రబాబు రాహుల్ తో పొత్తు పెట్టుకుంటారా | Chandrababu Naidu| Peoplesposttv| అయితే,అసలే ఈ మధ్య అందరిచేత ‘మెచ్యూర్ బాయ్’ అని మన్ననలు పొందుతున్న రాహుల్… బాబును కలుపుకోవడం వల్ల జరిగే పరిణామాల గురుంచి తీవ్రంగానే ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా,చంద్రబాబుతో పొత్తు విషయంలో రెండు కోణాలు దాగి ఉన్నాయి. ఒకటి… ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు చేసిన అన్యాయం దృష్ట్యా … ప్రధాని నరేంద్ర మోడీని ఓడించటం అక్కడ కేంద్రంలో రాహుల్ గాంధీకి ఎంత ముఖ్యమో ఇక్కడ చంద్రబాబుకు కూడా అంతే అవసరం. పైగా బాబుకున్న అనుభవం జాతీయ రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే చక్రం తిప్పాలనుకుంటున్న రాహుల్ కు పనికొస్తుంది. రెండోది… కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో మరి దయనీయంగా తయారయ్యి దాదాపు ‘సున్నా’కు పడిపోయిన తరుణంలో పొత్తు మేలే చేస్తుందని కాంగ్రెస్లో ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడుతూ వచ్చారు. కానీ తెలంగాణాలో రిజల్ట్ బెడిసికొట్టడంతో మళ్లీ ఆలోచనలో పడ్డారు. ఏపీలో కూడా చేతులు ఉన్న వేళ్ళతో సహా కాల్తయేమో అని ఆలోచిస్తున్నారు. ఆంధ్ర ఎలక్షన్ కు చంద్రబాబు రాహుల్ తో పొత్తు పెట్టుకుంటారా | Chandrababu Naidu| Peoplesposttv| దీంతో… రాహుల్ ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై పార్టీ ముఖ్యనేతల అభిప్రాయాలను తెలుసుకోమని ఆదేశించడంతో… ఈ అంశంపై ఊమెన్ చాందీ, రఘువీరా రెడ్డి 175 నియోజకవర్గాల్లో నేతల అభిప్రాయాలను సేకరించారు. మొత్తంగా చూస్తే… టీడీపీతో పొత్తుపై పార్టీ శ్రేణుల నుంచి మిశ్రమ స్పందన కనిపించింది. కొంతమంది పొత్తుతో మంచిదని చెప్పగా, మరికొందరు ‘ససేమిరా’ అంటున్నారని సమాచారం. కాబట్టి… ఈ అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకొని,కూలంకషంగా చర్చించడానికి ఈ నెల 25న రఘువీరా,ఊమెన్ చాందీతో కలిసి చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. కాంగ్రెస్ తో పొత్తు ఇక్కడ కూడా పొడుస్తుందో,అల్రెడీ అక్కడ పొడిచిన పొత్తు మాత్రమే కొనసాగుతుందో నెలాఖరుకి ఓ కొలిక్కి రావొచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆంధ్ర ఎలక్షన్ కు చంద్రబాబు రాహుల్ తో పొత్తు పెట్టుకుంటారా | Chandrababu Naidu| Peoplesposttv| Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost












