ఈ పన్ను రాయితీలు, అమరావతి నిర్మాణాలకు ఇవ్వలేరా...... ఏం పాపం చేశాం మేము.... మొదట. చెన్నై నగర నిర్మాణానికి మా చెమట చిందించాం, కాదు పొమ్మన్నారు..బయటకొచ్చి బతుకుతున్న మమ్మల్ని తీసుకెళ్ళి తెలంగాణ తో కలిసుండమన్నారు....సరే అని సర్దుకున్నాం..హైదరాబాద్ నగర ఆధునీకరణ కోసం అహర్నిశలు పరిశ్రమించాం, అక్కడనుండి కూడా బయటకు తోసేశారు... కష్టమైనా నిలబడ్ఢాం..ఇప్పటికైనా, మాకోసం ఒక రాజధాని కట్టుకుందాం అనుకున్నాం, చితికి పోయున్నాం, సహాయం చేయమని అభ్యర్థించాం, ఇప్పటికీ మీ కన్ను అభివృద్ధి చెందిన రాష్ట్రాల మీదే పెట్టి, మా కోసం కనీసం ఎంగిలి చేయి విసరటానికి కూడా మనసురాకుండా, మరొకరికి మాత్రం విందుభోజనం పెడుతుంటే...ఎన్నాళ్ళు కన్నీళ్ళు ఉగ్గబట్టుకోని బతకాలి !! మేం చేసిన నేరమేంటి !!! స్వాతంత్య్రం వచ్చాక ప్రభుత్వ పరంగా అత్యంత నిర్లక్ష్యానికి గురైంది మా ఆంధ్రప్రదేశే. విశాఖ ఉక్కు పరిశ్రమ తప్ప , ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమ లేదు. అదికూడా ఎన్ని పోరాటాల తర్వాతనో...ఇక్కడేదైనా పచ్చగా ఉందంటే అదంతా మా రెక్కల కష్టమే. మా ఆంధ్రులకు కొండలను పిండి చేసే కండబలం ఉంది, ఆకాశానికి నిచ్చెనలేయగల మేధోశక్తి ఉంది.అస్సలు కోల్పోని ధైర్యం ఉంది. మాకు కావాల్సింది కొంచెం చేయూత. కానీ, అదేమి దురదృష్టమో, ఇప్పటివరకు ఎప్పుడూ లభించలేదు. మా చుట్టూ ఉన్న రాష్ట్రాలు మీరిచ్చే ఎనర్జీ డ్రింక్స్ తో పరిగెడుతుంటే, మేము ఒకకాలితోనే పరిగెడుతూ వారికి ధీటుగా పరిగెడుతున్నాం. మమ్మల్ని సరిగ్గా నిలబెట్టి పరిగెత్తించండి. మొత్తం భారతదేశానికే చోదకశక్తిగా మారతాం. మాకేమీ పెద్ద ఎనర్జీ డ్రింక్స్ కూడా అక్కర్లేదు, మా ఉలవచారు చాలు. కేవలం దెబ్బతిన్న మేము నిలదొక్కుకొనేలా చేయండి చాలు.....మీరు ఆశిస్తున్న 5 ట్రిలియన్ డాలర్ల పవర్, 8 % జిడిపి, ఇవన్నీ సాధ్యం అవుతాయి.. ఆంధ్రప్రదేశ్ కి చిన్న సహాయం అనే అగ్గి అంటించండి ! ప్రపంచమంతా ప్రచండంగా వెలిగే అగ్గిలా మారతాం.. దయచేసి మమ్మల్ని గుర్తించండి..అభివృద్ధి కోసం ఆరాటపడుతున్న మా ఆంధ్రుల హృదయఘోష అర్థం చేసుకోండి.. #modishit #wastebjp #wastefellowkcr #jailjagan #JailJAGAnFanFuck #EVMPM #EVMCM #RajaNNaRajyaM #blodypolitics (at Chhattisgarh) https://www.instagram.com/p/Bzt_r5Qh13T/?igshid=fstrk8fwqaql