నీటిలో మునిగిపోయిన మహిషాసుర మర్ధిని గుడులు| ఎవరికీ తెలియని మహాబలిపురం యొక్క మరో రహస్యం!
Hey guys, ఈరోజు నేను మీకు మహాబలిపురంలో ఉన్న కొన్ని పురాతన రాతి గుడులను చూపించబోతున్నాను. మీరు వాటిని, ఇంతకు ముందు మరెక్కడ కూడా చూసుండరు. ఒకవేళ మీరు మహాబలిపురంకి వచ్చినప్పుడు, touristsలు ఎవరూ కూడా వీటిని మీకు చూపించరు. ఎందుకంటే ఇక్కడ ఇవి ఉన్నాయని tour guideలకు కూడా తెలియదు. Youtubeలో ఉన్న అన్ని travel channels కూడా ఇలాంటి అందమైన పెద్ద పెద్ద monumentsలను మాత్రమే మీకు చూపించాలనుకుంటున్నాయి. కానీ నేను కూడా ఇలా చేయడం guiltyగానే ఉంది, కానీ ఈరోజు మీరు చూస్తున్నది చాలా differentగా ఉంటుంది. మీరు beach పక్కన ఉన్న ఆ రాళ్లను చూస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడికి మనం వెళ్లి, అది పురాతన దేవాలయమా కాదా అని చూద్దాం రండి.
గుడికి వెనుక ఉన్న ఈ ప్రదేశాలను ఎవరూ visit చేయరు, అలానే వీటి గురించి archeological papersలో కూడా చదివుండరు. ఎందుకు? ఎందుకంటే వాటిని చెక్కడాలుగా కాకుండా కేవలం రాళ్లుగా భావిస్తున్నారు, కానీ వాళ్ళు ఒక పెద్ద రహస్యాన్ని మన దగ్గర దాచుతున్నారు. దీన్ని చూడండి, ఇది నీటికి చాలా దగ్గరగా ఉంది, ఇది సహజమైనదా లేదా చెక్కబడిందా? ఇక్కడ మీకు ఏవైనా tool marks కనిపిస్తున్నాయా? ఇప్పుడు వేరే angle నుండి దీన్ని చూడండి మీకు ఏదైనా వింతగా కనిపిస్తుందా? మీరు ఏదైనా ఒక రకమైన చెక్కడాన్ని చూస్తున్నారా? అసలు ఇది ఏంటీ? ఇది చాలా విచిత్రంగా ఉంది కదా, ఇది ఒక చెయ్యి లేదా మరేదైనానా? అది buffalo తలనా?
ఈ చెక్కడాలపైన సముద్రం నీళ్లు పడడం వల్ల ఇవి smooth అయ్యి, చూడడానికి చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇది మహిషాసురుడు అని పిలువబడే, గేదె తలతో ఉన్న ఒక రాక్షసుడు, అతని కుడి చెయ్యి తన నోటి దగ్గర ఉంచి, ఎడమ చేతిని తలపైకి, కొద్దిగా పైకి లేపాడు చూడండి. ఇది సహజమైన రాయి కాదని, ఇంకా ఇవన్నీ శిల్పులు చెక్కిన ఆకారాలని ఇప్పుడు మీరు అర్ధమైయుంటుంది. ఈ గేదె తన నాలుకను బయటికి లాగినట్టు చూపించారు, ఇంకా మీరు జాగ్రత్తగా గమనిస్తే, అతని braceletను కూడా చూడవచ్చు. ఈ రాయి మధ్యలో square shapeలో ఒక గది ఉంది చూడండి, బహుశా దీని లోపల మహిషాసురమర్దని అనే స్త్రీ దేవత అంటే గేదె రాక్షసుడు చంపిన దుర్గామాత ఉండవచ్చు.
ఈ square chamber ద్వారానికి, రెండు వైపులా రెండు సింహాలు కాపలాగా ఉన్నాయి చూడండి. ఈ దేవత పక్కన ఎప్పుడూ సింహాలు చెక్కబడి ఉంటాయని మన అందరికి బాగానే తెలిసు. ఇంకా ఈ square chamber లోపల, పసుపు మరియు కుంకుమ జాడలు ఉండడం మీరు చూడవచ్చు. దీని అర్ధం ఏంటంటే, స్థానిక ప్రజలు, కొందరు ఇప్పటికీ, ఇక్కడికి వచ్చి, ఈ దేవతను నిత్యం పూజిస్తున్నారు. వాళ్ళు పసుపు మరియు కుంకుమతో పూజలు చేసి, ఈ దేవతను ప్రార్థిస్తారు. ఇది చాలా interestingగా ఉంది, ఎందుకంటే ప్రతి సంవత్సరానికి, ఈ సముద్రం ముందుకు వస్తుంది కాబట్టి ఈ గుడికి ఎవరు రాలేకపోతున్నారు.
నేను దీన్ని కొంచెం ఎక్కువ చేసి చెప్తున్నానని ఇప్పుడు మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు ఎందుకంటే, ఈ గుడికి easy గా వెళ్లొచ్చు, water కూడా చాలా దూరంగానే కదా ఉంది అని మీకు అనుకోవచ్చు. నేను ఒక సంవత్సరంలో ఇక్కడ ఎన్ని సార్లు వస్తానని నాకే తెలియదు అన్ని సార్లు వస్తాననమాట, so అప్పుడే ఈ సముద్రం నీళ్లు లోపలికి వచ్చిన కారణంగా, ఈ గుడిని చేరుకోవడం చాలా కష్టంగా ఉండేది. నేను దీన్ని Shot చేసానంటే, నేను చాలా lucky అనే చెప్పాలి, ఎందుకంటే కేవలం ప్రకృతి అనుమతించినందున మాత్రమే నేను దీన్ని shot చేయగలిగాను. నిజానికి చెప్పాలంటే ఇక్కడ నుండి కొన్ని వందల అడుగుల దూరంలో మరో రెండు గుడులను మీకు చూపించాలనుకుంటున్నాను. అవి ఎక్కడున్నాయి?
అవును! నీటిలో ఉన్న ఆ రెండు రాళ్లే, అవి మనం చూసిన గుడుల లాగానే ఉన్నాయని, ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు కానీ, ఈ నీరు ఎప్పటికైనా తగ్గే ప్రసక్తి ఉందా. ఏదో ఒక రోజు నేను మీకు నీటి లోపలికి వెళ్లి ఆ రెండు గుడులను కూడా చూపిస్తానని అనుకుంటుంన్నాను. నాతో పాటు మీరు కూడా ఈ పురాతన గుడులను చూడాలనుకుంటున్నారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కానీ ప్రస్తుతానికి ఇది ప్రకృతి ద్వారా తీసుకోబడింది, కాబట్టి ఇదే ప్రకృతి యొక్క నిజమైన శక్తి. నా ఉద్దేశ్యం ఏంటంటే archaeology department వాళ్ళు, ఈ గుడులను రక్షించాలనుకున్న దాని గురించి కొంచెం ఆలోచించండి. And వాళ్ళు ఈ పెద్ద monumentsను కాపాడటానికి ప్రయత్నించారు, కానీ అన్ని సమయాలలో, ఈ అలలు ఒడ్డున ఉన్న గుడిని స్వాధీనం చేసుకుంటున్నాయి, కాబట్టి వాళ్ళు ఏం చేయగలరు?
ఇంకా వాళ్ళు సముద్రం నుండి ఈ తీర ఆలయాన్ని రక్షించాలంటే ఈ ఆలయం చుట్టూ ఎక్కువ రాళ్లను వేయవలసి వస్తుంది. కాబట్టి, మహాబలిపురంలో మునిగిపోయిన దేవాలయాలు ఉన్నాయని మనకు తెలిసింది, కానీ పాపం వాటిని మనం రక్షించలేకపోతున్నాము. ఇప్పుడు ఈ అందమైన చిన్న దేవాలయం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? నేను ఈ question అడిగినప్పుడు మీరు తడబడుతారని నాకు తెలుసు. ఏ ఆలయం లేదా చర్చి లేదా మసీదు యొక్క ప్రయోజనం ఏమిటి? వాటన్నిటిని ఇప్పుడే సృష్టించారు కాబట్టి, ప్రజలు ఈ దేవుళ్ళకు పూజలు మరియు ప్రార్ధనలు చేస్తున్నారు. కాబట్టి ఇది కాదు, దీన్ని వేరే ప్రయోజనం కోసం నిర్మించారు. నేను మీకు లోపల ఉన్న దేవత పేరు చెప్పాను మరియు స్థానికులు ఆమెను పూజిస్తారని కూడా నేను చూపించాను. కానీ చూడండి, ఇది ఎవరికీ తెలియని ఒక చిన్న మంచి రహస్యాన్ని దాస్తోంది.
- Praveen Mohan Telugu















